For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kangana Ranaut: కాంట్రవర్సీ క్వీన్ రెచ్చిపోతే ఇలా ఉంటుంది.. కుర్రాళ్ళ గుండెలు జారేలా ఘాటైన స్టిల్!

  |

  సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే అంత సాధారణ విషయం కాదు. ఎంత హాట్ హీరోయిన్ అయినా సరే అయిదేళ్ళ అనంతరం తప్పకుండా ఎంతోకొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిత్యం ఇండస్ట్రీలో ఎవరో ఒకరి నుంచి పోటీ అయితే ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఏళ్ళు గడిచినా కూడా, ఎంతమంది హీరోయిన్స్ పోటీగా వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయరు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉంది. కాంట్రవర్సీ క్వీన్ గా కూడా ఓ వర్గం వారి నుంచి కామెంట్స్ అందుకనే ఈ బ్యూటీ ఎలాంటి విషయం పైన అయినా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తోంది. ఆమెకు ఎదురుగా అగ్ర హీరోలు ఉన్నా సరే అలాగే బడా రాజకీయ నాయకులు ఉన్నా సరే ఏ మాత్రం భయపడకుండా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఇచ్చే హాట్ స్టిల్స్ మాత్రం సోషల్ మీడియా లో సరి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

  అవసరమైతే తప్ప..

  అవసరమైతే తప్ప..

  కంగనా రనౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడానికి ఎంతగానో కష్టపడింది. 2006 లో గ్యాంగ్ స్టార్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మెల్లగా మెట్రో, ఫ్యాషన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర వీలైనంతవరకు సరికొత్తగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. నటనతోనే కాకుండా గ్లామర్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అవసరమైతే తప్ప గ్లామర్ విషయంలో ఆమె పెద్దగా హద్దులు దాటింది లేదు.

  ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ

  ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ

  ఇక ఈ బ్యూటీకి చాలా రకాల అవార్డులు సైతం దాసోహం అయ్యాయి. వరుసగా నాలుగు నేషనల్ అవార్డులు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని అతి చిన్న గ్రామంలో జన్మించిన కంగనారనౌత్ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఒకవిధంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారికి ఆమె స్పూర్తిగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.

  విశ్వరూపం చూపించింది.

  విశ్వరూపం చూపించింది.

  ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోల సపోర్ట్ లేకుండా కూడా బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది. 2014 లో వచ్చిన క్వీన్ సినిమా 100 కోట్ల వసూళ్లతో అప్పట్లో అందరినీ షాక్ కు గురి చేసింది. ఎందుకంటే అప్పటి వరకు ఏ సినిమా కూడా ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. అనంతరం మణికర్ణికతో కూడా ఈ బ్యూటీ తన విశ్వరూపం చూపించింది. కేవలం నటిగానే కాకుండా అప్పుడప్పుడు దర్శకురాలిగా కూడా తన టాలెంట్ ను బయటపట్టే ప్రయత్నం చేసింది.

  కుర్రాళ్ళ గుండెలను జారేలా

  కుర్రాళ్ళ గుండెలను జారేలా

  ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ఇస్తున్నా గ్లామర్ ట్రీట్ కు కూడా కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఏమాత్రం లిమిట్స్ లేకుండా హాట్ నెస్ డోస్ పెంచుతూ సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో క్లీవేజ్ షోతో సరికొత్త షాక్ ఇచ్చింది. సీరియస్ గా చూస్తూనే ఎద అందాలతో కుర్రాళ్ళ గుండెలను జారేలా చేసింది. గతంలో ఇంతకంటే హై రేంజ్ లో కూడా హాట్ నెస్ డోస్ పెంచినప్పటికీ ఈ రేంజ్ లో ఆకట్టుకోలేక పోయిందని ఓ వర్గం అభిమానులు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. కంగనా ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  టాప్ రెమ్యునరేషన్..

  టాప్ రెమ్యునరేషన్..

  కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పంగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక కంగనా రనౌత్ తన రెమ్యునేషన్ ను కూడా గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో కూడా ఆమె స్థానం సంపాదించుకుంది. ఇటీవల కాలంలో అత్యధిక ఆదాయం కలిగిన నటీమణుల్లో ఫోర్బ్స్ జాబితాలో కూడా ఆమె టాప్ లిస్టులో కొనసాగుతోంది.

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
  దర్శకులతో గొడవలు

  దర్శకులతో గొడవలు

  ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ప్రయత్నం చేసే కంగనారనౌత్ ఆలోచనా విధానం చాలా విబిన్నంగా ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు కొంత మంది దర్శకులతో కూడా గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మణికర్ణిక షూటింగ్ చివరి దశలో డైరెక్టర్ క్రిష్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి చివరి దశలో తప్పుకొని కంగనా పై పలు విమర్శలు కూడా చేశారు. అనంతరం మిగిలిన షూటింగ్ షూటింగ్ మొత్తాన్ని కూడా ఆమె తన సొంత దర్శకత్వంలోనే పూర్తి చేసింది. ఇక ప్రస్తుతం ఆమె తలైవి సినిమా తో బాక్సాఫీస్ హిట్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా రూపొందిన ఆ సినిమాకు ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

  English summary
  Bollywood actress Kangana Ranaut latest mind blowing glamorous look,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X