Yoga Day... సముద్ర తీరంలో బికినీతో కరీనా కపూర్.. యోగా విన్యాసాలతో కేక!!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకొంటున్నారు. పలువురు సినీ తారలు తమ యోగా విన్యాసాలను ఫోటోలు, వీడియో రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసుకొంటున్నారు. తమ అభిమానులకు యోగాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే 2021 పురస్కరించుకొని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగా ఫోజుతో ఆకట్టుకొన్నారు. బీచ్ వద్ద గతంలో చేసిన యోగా విన్యాసాన్ని, గతంలో ఎవరూ చూడని ఫోటోను షేర్ చేశారు. తెలుపు, ఎరుపు వస్త్రాలను ధరించిన ఆమె నిలబడి చేసిన ఆసనాన్ని ఫోటో రూపంలో పోస్టు చేశారు. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఫ్రీ యువర్ మైండ్ అంటూ కాప్షన్ పోస్టు చేశారు.
అంతేకాకుండా తన యోగా ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయాన్ని యోగాతో ప్రారంభిస్తాను. మనసు, శరీరాన్ని ఏకంగా చేసే ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రక్రియ యోగా వల్లే సాధ్యమని బలంగా నమ్ముతాను. సహజత్వంతో కూడిన యోగా గురించి తెలుసుకోవడంపై ఎప్పుడూ ఎక్సైటింగ్ అవుతుంటాను. శరీరంలోని విషపూర్తిత అంశాలను బయటకు పంపించడానికి ఆయర్వేదం, యోగా సహకరిస్తాయి అని కరీనా కపూర్ తన పోస్టులో పేర్కొన్నారు.
తాను రెండోసారి గర్బవతి అయినప్పడు కూడా యోగాసనాలు వేయడంలో అశ్రద్ద వేయలేదు. కడుపుతో ఉన్న సమయంలో యోగా చేస్తూ దిగిన ఫోటోలను కూడా అభిమానులకు షేర్ చేశారు. తన అభిమానులకు, మహిళలకు యోగా వల్ల కలిగే లాభాలను సందర్భం దొరికిన ప్రతీసారి చెప్పడానికి ప్రయత్నిస్తారు.

ఇక కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. లాల్ సింగ్ చద్దా చిత్రం హాలీవుడ్‌లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్నది.
లాక్‌డౌన్‌కు ముందు కరీనా కపూర్ 2019లో గుడ్ న్యూస్ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన, అలాగే 2020 అంగ్రేజీ మీడియం చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో రెఫ్యూజీ చిత్రంతో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60కిపైగా చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











