For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికిని అందాలతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్.. ప్రముఖ దర్శకుడిపై లైంగిక కేసుతో సంచలనం!

  |

  బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కోమల్ శర్మ అలియాస్ కాటే శర్మ అందాల ఆరబోతతో రెచ్చిపోయారు. అందాల పోటీల ద్వారా సినీ పరిశ్రమలో ప్రవేశించిన ఈ యువ బ్యూటీ.. గతంలో ఏకంగా ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలు చేసి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించారు. ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన కాటే శర్మ తాజాగా బికినీలో శృంగార దేవత అవతారం ఎత్తి సోషల్ మీడియాను ఊపేస్తున్నది. కాటే శర్మ ఎవరు? సుభాష్ ఘాయ్ గురించి ఏమని ఆరోపణలు చేసింది? తాజా ఫోటోషూట్ గురించిన వివరాల్లోకి వెళితే..

  మిస్ పూణేగా కోమల్ శర్మ

  మిస్ పూణేగా కోమల్ శర్మ

  కాటే శర్మ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. పూణేలో పుట్టి పెరిగింది. 2006లో మిస్ పూణే ఆన్‌లైన్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ పూణే సెల్ఫీ పోటీలో విన్నర్‌గా నిలిచింది. అందాల పోటీల్లో సత్తా చాటిన తర్వాత మోడలింగ్, టీవీ షోల్లోకి అడుగుపెట్టింది. అలెన్ సోలీ, లెవీస్, పాంటాలూన్ లాంటి యాడ్స్‌లో, ఎంటీవీ రోడిస్ లాంటి షోలతో బాలీవుడ్ దర్శకులను నిర్మాతలను ఆకర్షించింది.

  బాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ

  బాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ


  బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు కాటే శర్మ ది మ్యాజికల్ లవ్ సాగా అనే చిత్రంలో 2016లో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కసమ్ తేరే ప్యార్ కే చిత్రంతో మరోసారి 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆమె కెరీర్ అక్కడే ఆగిపోయింది. అమీర్ నవాజ్ ఫీట్, తుమ్ మిలే లాంటి మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించింది.

  సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలు

  సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలు

  బాలీవుడ్‌లో 2018లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగి ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులపై హీరోయిన్లు, నటీమణులు దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో కాటే శర్మ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై దారుణమైన ఆరోపణలు చేసింది. దాంతో ఒక్కసారిగా ఆమె మీడియాలో ప్రముఖంగా కనిపించింది. దాంతో కాటే శర్మ మరోసారి గ్లామర్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకొన్నది.

  దర్శకుడిపై లైంగిక ఆరోపణల కేసు

  దర్శకుడిపై లైంగిక ఆరోపణల కేసు

  సుభాష్ ఘాయ్‌పై 2018, అక్టోబర్ 13వ తేదీన ఆరోపణలు చేస్తూ.. తనపై లైంగిక దాడికి ప్రయత్నించారు. బలవంతంగా ముద్దులు, కౌగిలింతలకు ప్రయత్నించాడు అని కాటే శర్మ చేసిన ఆరోపణలకు బాలీవుడ్ మీడియా ఉలిక్కిపడింది. ఆ తర్వాత అంతటితో ఆగకుండా ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలతో కేసు నమోదు చేసింది.

  ఫిట్‌గా ఉండటమే నా లక్ష్యం

  ఫిట్‌గా ఉండటమే నా లక్ష్యం


  ఇలా వివాదాలతో, హాట్ ఫోటో షూట్‌తో కాటే శర్మ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నది. గత మూడేళ్ల లాక్‌డౌన్ కారణంగా ఆమె కెరీర్ మరింత వెనక్కి వెళ్లింది. అయితే అందాల ప్రపంచంలో తాను ఉన్నానని సంకేతాలిస్తూ ఇటీవల జరిపిన బికినీ ఫోటోషూట్‌తో మళ్లీ గ్లామర్ ప్రపంచంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండటమే నా లక్ష్యం అంటూ కాటే శర్మ చెప్పింది.

  కాటే శర్మ బికినీ ఫోటోలు వైరల్

  కాటే శర్మ బికినీ ఫోటోలు వైరల్


  అందాల భామ కాటే శర్మ సముద్ర తీరంలో పాల్గొన్న ఫోటోషూట్ హాట్ హాట్‌గా మారింది. ప్రింటెడ్ ఫ్లోరల్ బికినీ, డ్రాయర్‌తో అభిమానులను అందాలతో మత్తెక్కిచింది. నడుము అందాలు, ఎదలోతులను బహిర్గతం చేస్తూ వేడివేడిగా అందాలను వడ్డించింది. ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో కాటే శర్మ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రముఖ ఫోటో గ్రాఫర్ వైరల్ బియానీ షేర్ చేసిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు భారీగా స్పందించి లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

  English summary
  Komal Sharma sizziling in bikini photoshoot goes viral which is shared by Viral Biyani recently. He wrote How much curves are too much ?. Staying fit should be a habit
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X