Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ కాంబినేషన్ చూసి టెంప్ట్ అయిన కీర్తి సురేష్.. యాక్షన్ హీరోకు గ్రీన్ సిగ్నల్
మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఆ సినిమా హిట్టయిన తరువాత ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా కనిపించలేదు. ఆ మధ్య మన్మథుడు సినిమాలో ఎదో చిన్న గెస్ట్ రోల్ చేసిందంతే. ఇక మిస్ ఇండియా, రంగ్ దే సినిమాలు ఈపాటికె రిలీజ్ కాచాల్సింది. కానీ లక్ డౌన్ వల్ల అవి వాయిదా పడక తప్పలేదు.
ఇక చాలా రోజుల తరువాత కీర్తి సురేష్ ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు తమిళ్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే యాక్షన్ హీరో గోపిచంద్ తో దర్శకుడు తేజ 'అలిమేలు మంగ వెంకటరమణ' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాజల్ అగర్వాల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిందని కథనలు వచ్చాయి కానీ అవి రూమర్స్ అని తెలిపోయాయి.

ఇక ఫైనల్ గా తేజ, గోపిచంద్ కాంబినేషన్ పై మహానటి ఇంట్రెస్ట్ చూపించి సింగిల్ సిట్టింగ్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సినిమాలో హీరోతో సమానమైన హీరోయిన్ రోల్ కావడంతో రెమ్యునరేషన్ కొంచెం తక్కువైనా కూడా అభ్యంతరం చెప్పలేదట.
జయం, నిజం సినిమాల్లో గోపిని విలన్ గా చూపించిన తేజ దాదాపు 17 ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో వర్క్ చేస్తున్నాడు. విలన్ గా చాలా పవర్ఫుల్ పాత్రల్లో చూపించి గోపిచంద్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన తేజ ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ హోరోగా ప్రజెంట్ చేయనున్నాడట. అందుకే కీర్తి సురేష్ సినిమా చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.