అతడి కోసం 15 ఏళ్ల వెయిటింగ్ చేశా.. కీర్తి సురేష్ లవ్ స్టోరీలో అదే అసలైన ట్విస్ట్..

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మలయాళ ముద్దుగుమ్మ ఎప్పుడూ తెలుగింటి అమ్మాయిలా నిండుగా కనిపిస్తోంది. బాలనటిగా 2000లో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2013లో 'గీతాంజలి' అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఇక 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది. ఆ తరువాత నాని, పవన్ కల్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ. ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో 'మహానటి' సినిమా ఓ మైల్ స్టోన్ మారింది. ఈ స్టార్ హీరోయిన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి దాదాపు 15 ఏండ్లు ఎదురుచూసిందట. కీర్తి సురేష్ లవ్ స్టోరీ చూస్తే.. సినిమాకు ఏమాత్రం తక్కువ లేదుగా అనిపిస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇటీవల హీరో జగపతి బాబు హోస్టింగ్ గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో జగపతి బాబు ఆమె కోసం సిద్ధం చేసిన సర్‌ప్రైజ్‌లు, చిన్ననాటి ఫోటోలు చూసి కీర్తి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్బంలో పలు పర్సనల్ విషయాలను పంచుకున్నారు. కీర్తి తన 15 ఏళ్ల సీక్రెట్ లవ్ స్టోరీను తొలిసారిగా బయటపెట్టింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ, "నా జీవితంలో ఆంటోనీ తట్టిల్ చాలా ప్రత్యేక వ్యక్తి. మేము స్కూల్ రోజుల నుంచే ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ ఆ సమయానికి కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ రిలేషన్‌ను బయటపెట్టలేదు" అని చెప్పారు.

Keerthy Suresh Opens Up on 15-Year Love Story and Secret Wedding with Antony Thattill

తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ఖతార్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఇద్దరూ 5 సంవత్సరాలు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వెల్లడించారు. "మేము వేర్వేరు మతాలకు చెందిన వాళ్లం. ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం వల్ల చెప్పడానికి సమయం పట్టింది" అని ఆమె చెప్పింది. జగపతిబాబు "యుఎస్ వెళ్లకుండా సినిమాల్లోకి రావడమే నీ కల కదా?" అని అడగగా, కీర్తి నవ్వుతూ, "అవును, ఇంట్లో వాళ్లు యుఎస్ వెళ్ళమన్నారు. కానీ, నాకు సినిమాల మీద ప్యాషన్ ఎక్కువ. అందుకే టోఫెల్ ఎగ్జామ్‌లో కావాలనే ఫెయిల్ అయ్యా!" అని సరదాగా చెప్పింది.

కీర్తి తన ప్రేమ వ్యవహరాన్ని తన తండ్రి సురేష్ కుమార్‌కి నాలుగేళ్ల క్రితమే ఈ విషయాన్ని తెలిపానని, ఆయన ఎలాంటి ఆగ్రహం లేకుండా కూల్‌గా ఒప్పుకున్నారని కీర్తి చెప్పింది. "నాన్నను ఆంథోనీ గురించి చెప్పినప్పుడు ఆయన సింపుల్‌గా 'నీకిష్టమైతే చాలు' అన్నారు. ఆ సపోర్ట్ నాకు చాలా బలాన్నిచ్చింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య మేము జీవిత బంధంతో ఒక్కటయ్యాం. అయితే, మా పెళ్లి వేడుక చాలా ప్రైవేట్‌గా జరిపినందున అందరినీ ఆహ్వానించలేకపోయాం. "పిలవలేకపోయిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను," అంటూ కీర్తి సురేష్ భావోద్వేగంగా తెలిపింది.

హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ గతేడాది వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్ చెన్నైలో, ఆంటోనీ తట్టిల్ కొచ్చిలో వ్యాపారం చేస్తున్నారు. "మా 15 ఏళ్ల ప్రేమలో చాలానే ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం. కానీ ఆ బంధం ఇంతకాలం నిలిచింది అంటే ప్రేమ నిజమైనదే'అని కీర్తి చివరగా అన్నారు. ఇక ప్రొఫెషనల్ ఫ్రంట్‌లోకి వస్తే.. కీర్తి సురేష్ త్వరలో 'రౌడీ జనార్ధన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమెకు జోడీగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టీమ్ ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X