మహా నటి కాదు మహా నాటీ.. కీర్తి సురేష్ లైఫ్‌లో క్రైమ్ స్టోరీ.. జగపతి బాబు లీక్!

'కీర్తి సురేష్'.. 'మహానటి'తో తనకంటూ తెలుగు తెరపై ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళ ముద్దుగుమ్మ ఎప్పుడూ తెలుగింటి అమ్మాయిలా నిండుగా కనిపిస్తోంది. 2000లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 2013లో మలయాళం సినిమా 'గీతాంజలి'సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ తరువాత నాని, పవన్ కల్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. 'మహానటి'సినిమా కీర్తి కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మారింది. తన నటనకు గానూ కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ తెలుగు కథానాయకిగా అవార్డు అందుకుంది. ఇలాంటి టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ లైఫ్‌లో క్రైమ్ స్టోరీ.. జగపతి బాబు లీక్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

జీ తెలుగులో ప్రసారమయ్యే 'జయమ్ము నిశ్చయమ్మురా'అనే షోకు జగపతిబాబు హెస్టింగ్ చేస్తున్నారు. ఈ షోలో సెలబ్రెటీలు పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలన్ని, కాలేజీ కబుర్లని, ఫ్యామిలీ విషయాలన్ని జగ్గుభాయ్ తో పంచుకుంటున్నారు. తాజాగా ఈ షోకు స్టార్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ ప్రత్యేక అతిథిగా హాజరు అయినట్టు తెలుస్తోంది. ప్రోమోలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్‌కు జగపతిబాబు వరుస సర్‌ప్రైజ్‌లు ఇచ్చే సరికి, ఆమెకు సంబంధించిన కొన్ని పర్స్నల్ సీక్రెట్స్‌ను కూడా పబ్లిక్‌కి చూపించారు. కీర్తి సురేష్ కు తన చిన్ననాటి అనుభవాలు, తన స్కూల్ ఫోటోలు, మెమెరీస్ ను గుర్తుకు చేశారు. తనకు మాత్రమే తెలిసిన విషయాలను కూడా బయటపెట్టి కిర్తీకి షాక్ ఇచ్చారు.

Keerthy Suresh s Funny Secrets Revealed by Jagapathi Babu on Jayammu Nischayammura Show

మహానటి సినిమా కీర్తి సురేష్ కెరియర్లో ఎంతటి విజయాన్ని, కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ సినిమాను ఉద్దేశించి, జగపతిబాబు మాట్లాడుతూ.. 'నువ్వు అందరికీ మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ చూపించావు.. ఇప్పుడు నీ బయోపిక్ సినిమాను చూద్దామా' అంటూ పంచ్ వేస్తాడు. 'అయ్యయ్యో వద్దు సార్జజ అన్ని విషయాలు బయట పెట్టకండి'అంటూ రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇండస్ట్రీలో మహానటివి అందరికీ తెలుసు.. బయట నువ్వు ఇంకా పెద్ద మహానటివే.. అంటూ సెటైర్ వేస్తాడు. వెంటనే కీర్తి సురేష్ రియాక్ట్ అవుతూ..' మీరు మాత్రమే మహా నాటీని' అంటూ ఫన్నీ రిప్లై ఇస్తుంది.

ఈ సమయంలో కీర్తి సురేష్ స్కూల్ నాటి ఫోటోలను చూపిస్తాడు. 'మీరందరూ దశాబ్దాలు దశాబ్దాలు ప్రేమించుకుంటారు కదా' అంటూ సెటైరికల్ గా మాట్లాడుతాడు జగపతిబాబు. వాస్తవానికి కీర్తి సురేష్ తన 15 సంవత్సరాల వయసులోనే ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తి పరిచయం కావడం. ఆ పరిచయం ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం దొంగతనాలు చేసిన విషయాన్ని జగపతి బాబు బయటపెట్టి షాక్ ఇస్తాడు. 'పాకెట్ మనీ దొంగతనం చేయడంలో ఆ సంతోషమే వేరు' అంటూ కీర్తి తన స్టైల్ లో రిప్లై ఇస్తుంది. అదేవిధంగా 'సింగపూర్ లో ఏదో క్రైమ్ లో ఇరుక్కున్నావట కదా ?'అంటూ జగపతిబాబు ప్రశ్నిస్తాడు.. అదొక్కటే తక్కువ అంటూ..'పోస్టర్ పెట్టేస్తారు స్టేషన్ లో' అంటూ టర్నింగ్ రిప్లై ఇస్తుంది.

ఆ తర్వాత 'అవును కుంభకర్ణి.. ఆరు నెలలు తింటావు.. ఆరు నెలలు పడుకుంటావు..' అంటూ ఫుడ్ గురించి ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ అడుగుతాడు. దీంతో షాక్ అయిన కీర్తి.. 'నా గురించి అన్ని తెలుసా మీకు.. ఇది ఎలా సాధ్యం'అని ఆశ్చర్య పోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X