For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లు అసలైన నిర్మాతలు కాదు, చెంప పగలగొట్టా, సెక్స్‌ అంశంపై అందుకే అలా: ఖుష్బూ

  |

  ఒకప్పుడు సినిమా హీరోయిన్‌గా సౌత్ ఇండియాతో పాటు హిందీ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ. తమిళ దర్శకుడు సుందర్‌ను పెళ్లాడిన ఆమె, హీరోయిన్‌గా తన కెరీర్ ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పాలిటిక్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతున్నారు.

  పెళ్లికి ముందు సెక్స్, కన్వత్వం లాంటి అంశాల్లో గతంలో ఖుష్బూ చేసిన స్టేట్మెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో పాటు కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో కూడా ఖుష్బూ తనదైన వాదన వినిపించారు. తాజాగా ఓ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు అంశాలపై స్పందించారు.

   పెళ్లికి ముందు సెక్స్ అంశంలో నేను చెప్పింది వేరు...

  పెళ్లికి ముందు సెక్స్ అంశంలో నేను చెప్పింది వేరు...

  పెళ్లికి ముందు సెక్స్ అంశంలో నేను చెప్పింది ఒకటి... ప్రచారం చేసింది మరొకటి అని ఖుష్భూ స్ఫష్టం చేశారు. తమిళనాడులో కొన్ని ఏరియాల్లో హెచ్ఐవి ప్రభావం ఎక్కువగా ఉంది, పెళ్లికి ముందు సెక్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ అనడానికి చెత్తుకుప్పల్లో దొరుకుతున్న పసికందులే నిదర్శనం. ఒక వేళ ఎవరైనా పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవి నుంచి రక్షణ పొందడానికి, గర్భం రాకుండా ఉండటానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను చెప్పాను. కానీ నా వ్యాఖ్యలను తమిఓనాడులోని రెండు పార్టీలు వక్రీకరించి ప్రచారం చేశారు అని ఖుష్బూ తెలిపారు.

  వెంకటేష్, నాగార్జున వల్లే ఇదంతా

  వెంకటేష్, నాగార్జున వల్లే ఇదంతా

  నేను 9వ తరగతిలోనే చదువు మానేసినా ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడటానికి కారణం... నా ఫస్ట్‌ హీరో వెంకటేష్, సెకండ్‌ హీరో నాగార్జున కారణం. ఇద్దరూ అప్పుడే అమెరికా నుంచి వచ్చారు. వారితో సినిమాలు చేసినప్పుడు ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలి అని చెప్పేవారు. ఎలా మాట్లాడాలో నేర్పించారు. నాగార్జున గారు నాకు ఒక ఇంగ్లిష్‌ పుస్తకం ఇచ్చారు. అదే నాకు వచ్చిన ఫస్ట్‌ బుక్‌ గిఫ్ట్‌. వారి ప్రోత్సాహం, సూచనలతో ఇంగ్లీషులో ఆరితేరాను అని ఖుష్బూ తెలిపారు.

   నాన్న రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు

  నాన్న రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు

  సినిమాలు చేస్తున్నపుడు నేను మైనర్. 1986లో నన్ను, అమ్మను, నా ముగ్గురు అన్నయ్యలను రోడ్డు మీద వదిలేసి నాన్న ముంబై వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ బ్యాంకు లాకర్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పోయారు. ఇప్పటి వరకు ఆయన కాంటాక్టులో లేరు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ముంబై వెళదామంటే అక్కడ ఇల్లు కూడా లేదు. పని మద్రాస్‌లో ఉంది.. ఇక్కడే సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ తమిళనాడులో సెటిలయ్యాను అని ఖుష్బూ తెలిపారు.

  ఆ ఇద్దరూ ఎంతో హెల్ప్ చేశారు

  ఆ ఇద్దరూ ఎంతో హెల్ప్ చేశారు

  నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిన సమయంలో రాఘవేంద్రరావు గారు, రామానాయుడుగారు ఎంతో సాయం చేశారు. వాళ్లిచ్చిన నైతిక మద్దతు మరువలేనిది. తర్వాత తెలుగు ఇండస్ర్టీ హైదరాబాద్‌కు వచ్చేసింది. దీంతో నేను చెన్నైలోనే ఉండిపోయాను అని తెలిపారు.

  తిండిలేక పస్తులు ఉన్న రోజులున్నాయి

  తిండిలేక పస్తులు ఉన్న రోజులున్నాయి

  నా జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టపడ్డాను. తిండి లేకుండా పస్తులున్న రోజులు కూడా నాకు గుర్తున్నాయి. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇల్లు గడవటం కోసం చేతి గాజులు, ఉంగరం కూడా అమ్మేశాను.. అని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు.

   కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు

  కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు

  సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఈ మధ్య చాలా వినిపిస్తోంది. కానీ ఇది సినిమా పరిశ్రమలోనే కాదు.. అన్ని రంగాల్లో ఉంది. నేను చైల్డ్‌ ఆర్టి‌స్టగా సినిమా రంగంలోకి వచ్చాను. నాకిప్పుడు 48. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ అన్ని భాషల్లో చేశాను. కానీ ఇంతవరకు నాకు అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎవ్వరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు అని ఖుష్బూ తెలిపారు.

  తప్పుగా టచ్ చేస్తే చెంప పగలగొట్టాను

  తప్పుగా టచ్ చేస్తే చెంప పగలగొట్టాను

  ‘కలియుగ పాండవులు' క్లైమాక్స్‌ షూటింగ్‌ ఒక విలేజ్‌లో జరుగుతున్నపుడు ఆగ్రామానికి వ్యక్తి తప్పుగా టచ్ చేశాడు. వెంటనే చెంప పగలకొట్టాను. దాంతో మొత్తం గ్రామస్తులందరూ వచ్చేశారు. ఆ సమయంలో వెంకటేశ్‌గారు, సురేష్ బాబుగారు, టెక్నీషియన్స్‌ అందరూ నాకు మద్దతుగా నిలబడ్డారు అని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు.

   వాళ్లు అసలైన నిర్మాతలు కాదు

  వాళ్లు అసలైన నిర్మాతలు కాదు

  ఏ నిర్మాత ఒక్కరాత్రి కోసం కోట్లు ఖర్చుపెట్టేయడు... సినిమా తీసే ఆలోచన లేని వారు కొందరు ఇలాంటి కోరికలు తీర్చుకోవడానికి నిర్మాత పేరుతో ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతుంటారు. సినిమా మీద పాషన్ ఉన్న నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి జోలికి వెళ్లరు. వారి దృష్టంతా సినిమా మీదనే ఉంటుంది అని ఖుష్బూ వెల్లడించారు.

  English summary
  Khushboo comments on casting couch and premarital sex. Kushboo Sundar is an Indian film actress, producer and television presenter who has acted in more than 200 movies. She is predominantly known for her work in the South Indian film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X