Kiara Advani కిక్ కొడితే.. గిరగిరా తిరిగి కిందపడి.. వైరల్‌గా వీడియో
బాలీవుడ్ భామ కియారా అద్వానీ కేవలం అందం మీదే కాదు.. ఫిట్‌నెస్‌పైనా దృష్టిపెడుతారనే విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారనే విషయానికి ఓ సాక్ష్యంగా నిలిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఫిట్‌నెస్ ప్రాక్టీస్ సందర్భంగా తీసిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా లక్షలాది మంది నెటిజన్లతోపాటు సినీ సెలబ్రీటీలు కీర్తీ సురేష్‌తోపాటు పలువురు లైకులు కొట్టడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...
తన వర్కవుట్ ప్రాక్టీస్‌లో భాగంగా కిక్ సెషన్స్ తెర లేపారు. బ్యాక్ కిక్ కొట్టే ఓ సాహసానికి కియారా ఉత్సాహం చూపారు. తన పర్సనల్ ట్రైనర్‌ను నిలబెట్టి.. అతడి తలపై టోపిని పెట్టి దానిని టార్గెట్ చేస్తూ బ్యాక్ కిక్‌ను ప్రాక్టీస్ చేసింది. రెండుస్లారు ట్రై చేసినప్పటికీ. ఆ కిక్ పర్‌ఫెక్ట్‌గా ఫినిషింగ్ చేయలేకపోయింది. మూడోసారి తన బ్యాక్ కిక్‌తో క్యాప్‌ను కాలితో కొట్టగా గిరగిరా తిరిగి కిందపడింది. దాంతో ఆమె ఉత్సాహం గంతులేస్తూ సాధించాననే ఫీలింగ్‌ను కనబరించింది.

బ్యాక్ కిక్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ కియారా.. నా ముందు నిలుచుకొన్న వ్యక్తి లలిత్‌కి హ్యాట్సాఫ్. ఇలా బ్యాక్ కిక్ కొట్టడం ఏడాదిన్నర అయింది. నా కిక్‌పై నమ్మకం ఉంచినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఓ మెసేజ్ పోస్టు చేసింది. ఈ వీడియోను సుమారు 5 లక్షల మంది వీక్షించారు. కియారాకు ఇన్స్‌టాగ్రామ్‌లో 17.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కియారా కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న షేర్షా చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్నారు. కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చూస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇంకా భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











