Kiara advani : చరణ్ సినిమా కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. మూడో సినిమాకే అంతా?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఆసక్తికర కాంబినేషన్ ఏదైనా సెట్ అయింది అంటే అది రామ్ - చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పవచ్చు. తమిళంలో కాక ఇండియా లెవల్లో పేరున్న శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తూ ఉండటం అది కూడా దిల్ రాజు కు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతున్న క్రమంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన కియారా అద్వానీ రెమ్యూనరేషన్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

పరిస్థితులు తారుమారు
ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ విషయంలో రెమ్యూనరేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది.. హీరో హీరోయిన్స్ రెమ్యూనరేషన్లు పోల్చిచూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది.. కానీ రాన్రాను హీరోయిన్స్ కి కూడా రెమ్యూనరేషన్ అధికంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్స్ కూడా కష్టపడి సినిమాల కోసం పనిచేస్తూ ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా వారికి రెమ్యూనరేషన్లు ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.. దానికి తగ్గట్టు వారికి ఉన్న మార్కెట్ కూడా సినిమాకు కలిసి వస్తూ ఉండటంతో దర్శక నిర్మాతలు ఏ మాత్రం సంకోచించడం లేదు. అలా తాజాగా కియారా అద్వానీ రామ్ చరణ్ సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబుతో ఎంట్రీ
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హీరోయిన్ కియారా అద్వానీ మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ అక్కడ పెద్దగా అవకాశాలు దక్కించుకున్న దాఖలాలు అయితే లేవు. ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె బాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ మాయలో పడేసింది.. ఒక రకంగా బాలీవుడ్లో సూపర్ క్రేజ్ అనుభవిస్తున్న ఈ బ్యూటీ అక్కడ భారీగా రెమ్యూనరేషన్ సంపాదిస్తూ ఎడతెగని బిజీగా ఉంది.

మూడో సినిమాకే
అయితే ఆ మధ్య ఈ భామను వినయ విధేయ రామ సినిమాలో నటింపజేసేందుకు బోయపాటి శ్రీనివాస్ ఇక్కడికి తీసుకు వచ్చి ఆ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు. రామ్ చరణ్ తేజ్ సరసన హీరోయిన్ నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఈ భామ మళ్ళి తెలుగు సినిమాల వంక చూసిన పాపాన పోలేదు..బాలీవుడ్లో సూపర్ క్రేజ్ రావడం అక్కడ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఈ భామను మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శంకర్ - దిల్ రాజు సిద్ధమయ్యారు.. అన్నట్టుగానే ఆ భామ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పదిహేనవ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఈ భామ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయమే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది

భారీ డిమాండ్
నిజానికి ఈ భామ తెలుగులో భరత్ అనే నేను సినిమా చేసేటప్పుడు కేవలం 80 లక్షలు మాత్రమే తీసుకుందట. ఇక ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమా కోసం కాస్త రెమ్యునరేషన్ పెంచినా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయింది. అయితే కబీర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో ఏకంగా ఈ భామ కోట్లల్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు రామ్ చరణ్ సినిమాలో నటించేందుకు ఏకంగా ఈ భామ ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.. అసలే శంకర్ సినిమా, అందుకే ముందు నుంచి దిల్ రాజు సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఫైనల్ గా
ఈ నేపధ్యంలోనే రంగంలోకి దిగిన దిల్ రాజు ఆమెకు నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలమని చెప్పారట. అయితే అంత తక్కువకి చేసేది లేదని ఆమె కూడా గట్టిగా చెప్పడంతో ఇక చేసేది లేక ఇద్దరి మాట కాకుండా నాలుగున్నర కోట్ల రూపాయలకు డీల్ ఫైనల్ చేశారట. ఆ నాలుగున్నర కోట్ల రూపాయల డీల్ తోనే ఆమె సినిమాలో నటిస్తోందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతానికి ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. శంకర్ సినిమా కథను ఫైనల్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు నుంచి బుర్రా సాయిమాధవ్ కూడా పని చేయబోతున్నారనే వార్తలు వెలువడగా వాటిని యూనిట్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.
Recommended Video

ముందు ఐఏఎస్-తర్వాత సిఎం
ఇక జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ముందుగా రామ్ చరణ్ తేజ ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.. ముందు ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్న ఆయన తరువాత సీఎం కూడా అవుతారని ప్రచారం జరుగుతోంది.. ఈమేరకు కథ లీక్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ దీనికి సంబంధించి యూనిట్ మాత్రం ఎలాంటి ఖండనలు కానీ సమర్ధనలు కానీ చేయలేదు. అయితే మొత్తం మీద కియారా అద్వానీ రెమ్యునరేషన్ వ్యవహారం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











