For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kiara Advani:ఆయనపై మనసు పారేసుకొన్నా.. సిద్దార్థ్ కాదు అతడే నా ఫష్ట్ క్రష్ అంటూ కియారా అద్వానీ సీక్రెట్ రివీల్

  |

  బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరోసారి అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తాజాగా షేర్షా సినిమాలో నిజ జీవితంలో ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు స్క్రీన్ లవర్‌గా నటించింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. షేర్షా సినిమా ప్రమోషన్‌ సందర్భంగా తాను తొలిసారి ఓ వ్యక్తిని చూసి ప్రేమలో పడ్డాన అంటూ తన మనసులోని భావాలను పంచుకొన్నది. షేర్షా సినిమా గురించి రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ...

  సినీ రచయిత తోట ప్రసాద్ కూతురు వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు ఎవరంటే?

  దేశం కోసం పోరాడే సైనికుడికి ప్రేయసిగా

  దేశం కోసం పోరాడే సైనికుడికి ప్రేయసిగా

  షేర్షా సినిమాలో డింపుల్ పాత్ర నా మనసుకు నచ్చినది. దేశం కోసం ప్రాణాలు లెక్క చేయని ఓ సైనికుడికి ప్రేయసిగా నటించాను. నా పాత్ర, నా యాక్టింగ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నా ఫెర్ఫార్మెన్స్ మంచి రెస్పాన్స్ వస్తున్నది. లాక్‌డౌన్ సమయంలో నాకు రెండు రిలీజ్‌లు దక్కాయి. ఈ విషయంలో నాకు చాలా హ్యపీగా ఉంది అంటూ కియారా అద్వానీ వెల్లడించింది.

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్, చరణ్ ఇలా: ఇద్దరు స్టార్లూ ఒకేలా.. వాళ్ల ముఖాల్లో అది గమనించారా!

  షేర్షాలో నాది ఎమోషనల్ పాత్రతో

  షేర్షాలో నాది ఎమోషనల్ పాత్రతో

  నేను పోషించిన డింపుల్ పాత్రకు కొన్ని సీన్లు ఉన్నప్పటికీ... ఎప్పటికి గుర్తుండిపోయే భావోద్వేగమైన పాత్ర. సినిమా రిలీజ్ తర్వాత నా అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నది. సోషల్ మీడియాలో నా పాత్ర గురించి ప్రశంసిస్తున్న తీరుకు చాలా హ్యాపీగా ఉంది అని కియారా అద్వానీ అన్నది.

  బోల్డు షోలో బౌండరీలు దాటిన మాళవిక శర్మ: ఒంటి మీద బట్టలు నిలవనంటున్నాయా ఏంటి!

  ముంబైలోని ఆ కేఫ్‌లో రచ్చ చేసే వాళ్లం

  ముంబైలోని ఆ కేఫ్‌లో రచ్చ చేసే వాళ్లం

  తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడిస్తూ.. నా కాలేజీ జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. సన్య, కరీనా, చార్వీ, అహుజా, సాక్షి నాకు చాలా ఇష్టమైన స్నేహితులు. మేమంతా హార్డ్ రాక్ కేఫ్‌లో ఎప్పుడూ ఎంజాయ్ చేసేవాళ్లం. మాకు హెచ్ఆర్సీ అనే గ్రూప్ ఉంది. మేమంతా ఆ కేఫ్ వెళ్లి గంటల తరబడి ఎంజాయ్ చేసే వాళ్లం అని కియారా అద్వానీ అన్నారు.

  అంబానీ కూతురు క్లాస్ మేట్‌గా

  అంబానీ కూతురు క్లాస్ మేట్‌గా

  కియారా అద్వానీ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది. కియారా అద్వానీకి అంబానీ కూతురు స్కూల్ మేట్. చిన్నతనం నుంచి అంబానీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు సంపన్న కుటుంబానికి చెందిన వారా? అంటే.. జీవితంలో విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎమోషనల్‌గా నేను చాలా రిచ్ అంటూ సమయస్పూర్తిగా జవాబు ఇచ్చారు.

  హృతిక్ రోషన్ అంటే ఇష్టం

  హృతిక్ రోషన్ అంటే ఇష్టం

  చిన్నతనం నుంచే బాలీవుడ్ అంటే చాలా ఇష్టం. సినీ ప్రముఖులను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా మంది సినీ సెలబ్రిటీలు అంటే ఆరాధ్యభావం ఉంది. నా చిన్నతనంలో నేను మనసు పడ్డ హీరో హృతిక్ రోషన్. కహో నా ప్యార్ హై సినిమా తర్వాత ఆయన నాకు పెద్ద క్రష్ ఏర్పడింది. అదే నాకు తొలి క్రష్ అని కియారా అద్వానీ చెప్పారు.

  కియారా అద్వానీ కెరీర్ ఇలా..

  కియారా అద్వానీ కెరీర్ ఇలా..

  కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్ సమయంలో అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన లక్ష్మీ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. తాజాగా థియేటర్లు సినిమాలకు అనుకూలంగా లేకపోవడంతో ఆమె నటించిన షేర్షా చిత్రం కూడా డీస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ప్రస్తుతం భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే సినిమాల్లో నటిస్తున్నారు.

  English summary
  Bollywood actress Kiara Advani busy with shershaah promotions. She reveals that her first crush was Hrithik Roshan in Shershaah movie promotions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X