Dabboo Ratnani Calendar కోసం రెచ్చిపోయిన కియారా అద్వానీ.. ఒంటి మీద ఏమీ లేకుండానే!
ముంబైలో పుట్టి పెరిగిన కియారా అద్వానీ సినిమాల మీద ఆసక్తితో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె దర్శకుడు కబీర్ సదానంద్ తెరకెక్కించిన కామెడీ డ్రామా ఫగ్లీ సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆ తరువాత సౌత్ సినిమాల మీద ద్రుష్టి పెట్టిన ఈ భామ రెండు తెలుగు సినిమాలు కూడా చేసింది. అయితే ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు రచ్చ రేపుతోంది.

బాలీవుడ్ ఎంట్రీ అలా
ఫగ్లీ అనే సినిమా ద్వారా కియారా అద్వానీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాకి వసూళ్లు బాగానే వచ్చినా ఆమెకు సినిమా మాత్రం పెద్దగా అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయింది. అయితే ఆ తరువాత ఆమె చేసిన ఎంఎస్ ధోని సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అయితే దక్కాయి

టాలీవుడ్ లో మహేష్ తో
ఇక 2018లో భరత్ అనే నేను సినిమాతో కియారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వసుమతి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్ అవకాశం కూడా దక్కింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగు నాట అవకాశాలు పెద్దగా దక్కలేదు.

బాలీవుడ్ లో వరుస సినిమాలు
తర్వాత బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఆమె ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తోంది. అందులో షేర్షా అనే సినిమా పూర్తి కాగా భూల్ భూలయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లే లే అనే సినిమాలు షూట్ దశలో ఉన్నాయి. అయితే ఈ భామ తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అంశం మీద కియారా అద్వానీ క్లారిటీ కూడా ఇచ్చింది.

డబ్బూ రత్నాని క్యాలెండర్ కోసం హాట్ గా
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పుడప్పుడూ తన ఫాలోవర్స్ కోసం హాట్ ఫోటోషూట్ రిలీజ్ చేస్తూ అలరిస్తుంటుంది. అయితే ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని రిలీజ్ చేస్తున్న 2021 క్యాలెండర్ కోసం ఈ భామ మరోసారి హాట్ గా కనిపించి షాకిచ్చింది. గత ఏడాది ఒక ఆకు వెనకాల నిలబడి అందరికీ షాక్ ఇచ్చిన ఈ భామ ఈసారి బీచ్ ఒడ్డున పడుకుని అసలు ఒంటి మీద ఏమి లేవు అని చూస్తున్న అందరినీ భ్రమింపజేసేలా ఫోజులు ఇచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా చూసేయండి.
Recommended Video

మరి కొద్ది రోజుల్లో క్లారిటీ
ఇక ఈ భామ కొరటాల శివ - ఎన్టీఅర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా ఎంపికైంది అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాక రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో కూడా ఈ భామ హీరోయిన్ ఎంపిక అయింది అని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ అంశాల మీద ఎప్పుడు క్లారిటీ వస్తుందో ?


Click it and Unblock the Notifications











