For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇందిరా గాంధీకి జిరాక్స్ కాపీలా.. మాజీ ప్రధాని పాత్ర పోషించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

  |

  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం బెల్ బాటమ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఈ చిత్రంలోని ఇందిరా గాంధీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రోల్‌ను పోషించిదేవరు అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌లో ఇందిరా గాంధీ లుక్ అందర్నీ ఆకర్షిస్తున్నది.

  Chirajeevi మనవరాలు క్యూట్ ఫోటోలు.. మెగాస్టార్ కౌగిలిలో అలాప్రేమగా!

  అచ్చం ఇందిరా గాంధీలా అంటూ..

  అచ్చం ఇందిరా గాంధీలా అంటూ..

  అయితే లారా దత్తా గురించి తెలిసిన వారికి ఇందిరాగాంధీ పాత్రలో నటించినదెవరు అనే విషయం పెద్దగా ఆసక్లిని కలిగించదు. అయితే తెలియని వాళ్లకు అచ్చం ఇందిరా గాంధీలా కనిపిస్తున్నది ఎవరనే విషయం మరింత ఆసక్తిని రేపింది. రంజిత్ తివారీ రూపొందించిన బెల్ బాటమ్ చిత్రంలో ఇందిరా గాంధీగా లారా దత్తా నటించింది. ఆమెను ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోయారు. అద్బుతమైన మేకప్ డిపార్ట్‌మెంట్ పనితీరుకు ఇదొక సాక్ష్యం అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు ఆ పోస్టుపై స్పందిసత్ూ.. చిత్ర యూనిట్‌కు హాట్యాఫ్. ఇందిరా గాంధీని తలపించే విధంగా నటిని ఎంచుకొన్నారు. మేకప్, హెయిర్ స్టైల్ డిపార్ట్‌మెంట్ గొప్పగా పనిచేసింది.

  Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ!

  లారా దత్తా మేకోవర్ అమేజింగ్

  లారా దత్తా మేకోవర్ అమేజింగ్

  ఇక లారా దత్తా గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలో లారా దత్తా మాదిరిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిన నటి మరొకరు లేరు. బెల్‌బాటమ్ చిత్రంలో లారా దత్తా మేకోవర్ అమేజింగ్‌గా ఉంది. ఇందిరాగాంధీ లుక్‌లో ఉన్నది లారా దత్తా అని ఎవరు గుర్తుపట్టలేరు. మేకప్ మ్యాన్ తప్పకుండా జాతీయ అవార్డు ఇవ్వాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా కొంతమందైతే బెల్ బాటమ్ ట్రైలర్‌లో ఇందిరాగాంధీలా కనిపిస్తున్నది లారా దత్తానా? ఓ మైగాడ్ అంటూ ఆశ్చర్య పోతున్నారు.

  Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్‌లో దీప

  ఇందిరా గాంధీ బయోపిక్ తీస్తే..

  ఇందిరా గాంధీ బయోపిక్ తీస్తే..

  ఇక ఒకవేళ ఇందిరా గాంధీ బయోపిక్ రూపొందిస్తే.. లారా దత్తానే సరైనా ఛాయిస్. ఆమె తప్ప మరొకరు ఇందిరా పాత్రకు సరితూగరేమో అన్నంతగా లారా దత్తా ఉన్నారు. నా ఛాయిస్ మాత్రం ఇందిరాగాంధీ బయోపిక్‌కు లారాదత్తానే అని స్పష్టం చేస్తున్నాను అంటూ ఓ నెటిజన్ తన అభిమానాన్ని చాటుకొన్నారు.

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  బెల్ బాటమ్ కథేంటంటే

  బెల్ బాటమ్ కథేంటంటే

  ఇక బెల్‌బాటమ్ సినిమా కథ విషయానికి వస్తే.. దేశంలోని గూఢచారి సంస్థ RAW అనే సంస్థలోని ఏజెంట్ కథ. ఈ సంస్థ నుంచి బెల్ బాటమ్ అనే కోడ్ పేరుతో ఓ ఆపరేషన్‌లోకి వెళ్తారు. ఈ కథ ఇతివృత్తం 1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం హాయంలో జరుగుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లారా దత్తాతో పాటు వాణికపూర్, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2021, ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. చాలా కాలంగా ఉత్తరాదిలో సినిమా రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తుందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
  బెల్ బాటమ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు

  బెల్ బాటమ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: అక్షయ్ కుమార్, వాణికపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా, డెంజిల్ స్మిత్, అనిరుధ్ ధావే, ఆదిల్ హుస్సేన్, థలైవాసై విజయ్ తదితరులు
  దర్శకత్వం: రంజిత్ ఎం తివారీ
  నిర్మాత: వశూ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ తదితరులు
  సినిమాటోగ్రఫి: రాజీవ్ రవి
  మ్యూజిక్: డేనియల్ బీ జార్జ్ (బీజీఎం), అమల్ మాలిక్, తాన్షిక్ బాగ్చీ, శంతను దత్తా, కుల్వంత్ సింగ్ భమ్రా, గుర్నాజర్, మణిందర్ బుట్టర్
  బ్యానర్: పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్: 2021-08-19

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Bollywood heroine Lara Dutta's Indira Gandhi Look of Bell Bottom goes viral. Many netizens surprised of Lara dutta look. Netizen wrote in twitter that, Lara Dutta's makeover in the movie Bell Bottom is indeed amazing...you will never be able to tell it is indeed Lara Dutta who portrayed Indira Gandhi...the makeup man indeed deserves a national award.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X