సినిమాలు లేకున్నా పెద్ద బ్రాండ్ పట్టేసిన లావణ్య.. రచ్చ మామూలుగా లేదుగా!
తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి కెరీర్ ఇప్పుడు అంతగా బాలేదు. ఈ మధ్య కాలంలో కాస్త హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తల్లో నిలవడానికి చూస్తున్న ఈ భామ చాలా కాలం పాటు వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. అందాల రాక్షసి తర్వాత దూసుకెళ్తా అనే సినిమా కూడా తెలుగులో చేయగా ఆ పాత్ర ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేక పోయింది. ఆ తర్వాత ఏడాది బ్రహ్మ అనే సినిమా ద్వారా తమిళ సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా అవేవీ వర్కౌట్ కాలేదు.
ఆ తర్వాత ఏడాది మారుతి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన బలే బలే మగాడివోయ్ సినిమాలో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. అలా ఆ తర్వాత వరుసగా సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తూ, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 KMPH, అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే చివరిగా ఆమె చేసిన చావు కబురు చల్లగా సినిమా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

ప్రస్తుతం సినిమా అవకాశాలు ఆమెకు పెద్దగా లేకపోయినా ఒక బ్రాండ్ దొరకడం ఆశ్చర్యకరంగా మారింది. తాజా వార్తల ప్రకారం టాప్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో నటించడానికి ఆమెకు ఇప్పుడు అవకాశం లభించింది. ప్రముఖ ఆయిల్ బ్రాండ్ గోల్డ్ విన్నర్ బ్రాండ్ అంబాసిడర్‌గా లావణ్యను నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి చెన్నైలో దీనికి సంబంధించిన యాడ్ షూట్ కూడా జరుగుతోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ బ్రాండ్ గాను దక్షిణ భారతదేశం మొత్తానికి ఆమెనే ఈ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉండనుంది.


Click it and Unblock the Notifications











