Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Madonna Sebastian జాకెట్ లేకుండా ప్రేమమ్ హీరోయిన్.. అదిరిపోయే లుక్‌తో ఫోటో వైరల్
దక్షిణాదిలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమైన ముద్దుగమ్మల్లో మడొన్నా సెబాస్టియన్ ఒకరనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమమ్ తర్వాత తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆమెను ఇంకా అదృష్ట దేవత కరుణించినట్టు కనిపించడం లేదు. ప్రేమమ్ చిత్రం ద్వారా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా ఎదిగితే.. మడొన్నా ప్రొఫెషనల్‌గా ఊగిసలాడుతున్నది. అయితే కెరీర్‌ను చక్కపెట్టుకోవాలని భావిస్తున్న మడొన్నా ఇటీవల షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోకు సంబంధించిన కథా కమామిషులోకి వెళితే..

సింగర్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ
మడోన్నా సెబాస్టియన్ నటిగా మారకముందు గాయనిగా మలయాళ సినీ పరిశ్రమకు సుపరిచతం. గోపి సుందర్, దీపక్ దేవ్ లాంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సూర్య టీవీలో మ్యూజిక్ మోజో షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రేమమ్ సినిమా రూపంలో సినిమా అవకాశం తలుపుతట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపుతట్టాయి.

ప్రేమ తర్వాత ఆఫర్లు భారీగానే.. కానీ
ప్రేమమ్ సినిమా తర్వాత కదాలమ్ కదందు పొగమ్ అనే చిత్రంతో తమిళ చిత్రం రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ప్రేమమ్ చిత్రంలో ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం పా పాండి, జుంగా, వైరస్, కొటిగబ్బ 3 చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అందం, అభినయం రెండు కలబోసిన నటిగా పేరు తెచ్చుకొన్నది. అయితే ఆమె టాలెంట్‌కు తగినట్టుగా పాపులారిటి రాలేదనే మాట వినిపిస్తుంది.

శ్యామ్ సింగరాయ్ చిత్రంలో లాయర్‌గా
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో లాయర్‌గా ఓ విభిన్నమైన పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్‌కు ఏ మాత్రం అవకాశం లేని పాత్రను చేసి తన మార్కు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. లాయర్ పద్మావతి పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రను మరొకరిని అడిగితే తప్పకుండా నిరాకరించే వారు. కానీ సీరియస్ పాత్రను చేయడానికి మడొన్నా సెబాస్టియన్ ఒప్పుకోవడం నిజంగా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిందని నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జాకెట్ ధరించకుండా ఫోటోషూట్
విభిన్నమైన
పాత్రలను
పోషించడానికి
ఇష్టపడే
మడొన్నా
సెబాస్టియన్
తాజాగా
తన
ఇన్స్‌టాగ్రామ్‌లో
జాకెట్
ధరించకుండా
చీరకట్టుతో
దిగిన
ఫోటోను
షేర్
చేసింది.
ప్రస్తుతం
ఆ
ఫోటో
సోషల్
మీడియాలో
వైరల్‌గా
మారింది.
మడొన్నా
ఫోటోపై
నెటిజన్లు,
అభిమానులు
ప్రశంసల
వర్షం
కురిపిస్తున్నారు.
మరో
విభిన్నమైన
పాత్ర
కోసం
మడొన్నా
రెడీ
అవుతున్నారేమో
అంటూ
నెటిజన్లు
కామెంట్స్
చేస్తున్నారు.

సంప్రదాయంగా చీరకట్టుతో
అయితే మడొన్నా మాత్రం సంప్రదాయ పద్దతిలో ఎరుపు రంగు చీర కట్టుకొని సీరియస్ లుక్స్‌తో ఆకట్టుకొంటున్నారు. అయితే ఆమె షేర్ చేసిన ఫొటో సినిమా కోసమా? లేదా ఏదైనా యాడ్ ఫోటోషూట్ కోసం దిగిందా అనే వివరాలను మడొన్నా వెల్లడించలేదు. అయితే ట్రెడిషనల్ లుక్‌లో మాత్రం మడొన్నా మరింత గ్లామరస్‌గా అందర్ని ఆకర్షిస్తున్నదనే కామెంట్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నది.

ఇన్స్‌టాగ్రామ్‌లో 25 లక్షల మంది ఫాలోవర్స్
ఇక మడొన్నా సెబాస్టియన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్‌టాగ్రామ్‌లో 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత కొంబు వచ్చ సింగమ్‌దా అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ తర్వాత వచ్చిన ఆఫర్లను అంగీకరించేందుకు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.