»   » మహేష్ ట్వీట్‌పై రచ్చ, బట్టలు చించుకోకు.. గాల్లో కాపురమా? శోభితపై నెటిజన్ల దాడి!

మహేష్ ట్వీట్‌పై రచ్చ, బట్టలు చించుకోకు.. గాల్లో కాపురమా? శోభితపై నెటిజన్ల దాడి!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sobhita Dhulipala Gets Serious comments From Mahesh Fans

  తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ తార శోభితా ధూళిపాల. గూఢచారి చిత్రంలో హాటుగా కనిపించి ప్రేక్షకులకు మత్తెక్కించింది. శోభిత అందాల అరబోతకు మంచి రెస్పాన్సే వచ్చింది. శుక్రవారం విడుదలై మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంల అడివి శేషు నటించడంతోపాటు రచనా సహకారాన్ని అందించారు. ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర ప్రముఖులు ట్వీట్ల వర్షం కురిపించారు. తాజాగా ప్రిన్స్ మహేష్‌బాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

  సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్

  సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్

  గూఢచారి సినిమా చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. తెలుగులో స్పై థ్రిల్లర్‌ను అటెంప్ట్ చేయడం అభినందనీయం. సినిమా క్రిస్పీగా, చాలా వేగంగా సాగుతూ కథ గ్రిప్పింగ్‌గా ఉండటంతో కొత్త అనుభూతికి లోనయ్యాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఫెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. టీమ్ సభ్యులందరికీ నా కంగ్రాట్స్ అని మహేష్ ట్వీట్ చేశారు.

   శోభిత ధూళిపాల రీ ట్వీట్

  శోభిత ధూళిపాల రీ ట్వీట్

  సూపర్‌స్టార్ మహేష్‌ ట్వీట్‌ను శోభితా ధూళిపాల రిట్వీట్ చేసింది. ప్రిన్స్ ప్రశంసలకు కేవలం థ్యాంక్యూ అంటూ ఓ సందేశాన్ని పెట్టింది. కేవలం ఒక్కమాట చెప్పడం.. అందులో గౌరవంగా సంభోదించకపోవడంతో ఫ్యాన్స్‌కు మండింది.

  మహేష్‌ బాబుకు ఇచ్చే గౌరవం ఇదేనా

  మహేష్‌ బాబుకు ఇచ్చే గౌరవం ఇదేనా

  ఓ సూపర్‌స్టార్ అంతగా ప్రశంసలు వెల్లడిస్తే కాస్త మర్యాదగా ప్రవర్తించడం తెలియదా? సీనియర్ నటుడు ట్వీట్ చేస్తే మీరు అలా సమాధానం ఇస్తారా అని నెటిజన్లు మాటల్లో రాయలేని విధంగా విరుచుకుపడ్డారు.

  నేల మీదకు రా పాప.. పీ సుశీల

  నేల మీదకు రా పాప.. పీ సుశీల

  పాప పీ సుశీల.. జరా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అమ్మా. సర్ అనకపోయినా ఫర్వాలేదు. మహేష్ గారు అనడం నీకే మంచిది. ఎందుకు చెబుతున్నామో కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మీ మూవీ హిట్ అయిందని బట్టలు చించుకోకు. కాస్త నేల మీదకు రా.. గాల్లో కాపురం పెట్టకు అని గట్టిగా ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

  సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

  సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

  మహేష్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతున్నది. కొందరు మహేష్‌కు అనుకూలంగా ట్వీట్లు చేస్తుండగా.. మరొకొందరు శోభితకు ప్రతికూలంగా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. చాలా నీచమైన భాషను ఉపయోగిస్తూ తిట్టుకోవడం కొంత ఇబ్బందిగా మారింది.

  English summary
  Sobhita Dhulipala recently made her debut in Telugu cinema with the film Goodachari, directed by Sashi Kiran Tikka. The film has also found a fan in Mahesh Babu, who took to Twitter to appreciate the filmmaker and the entire crew. He said also praised Adivi for his performance. Sobhita Dhulipala retweeted the post and wrote 'Thank you' to Mahesh Babu. This become contraversy in social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more