జాన్వీ కపూర్ పై మలయాళ సింగర్ విమర్శలు.. ఆ విషయంలో వివాదం
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు లీడింగ్ యాక్టర్స్ సరసన మెరుస్తూ హీరోయిన్ గా మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలో తన పేరు ఏదో రకంగా ఎప్పుడూ ట్రెడింగ్ లోనే ఉండటం సాధారణంగా మారింది. అయితే జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ పరమ్ సుందరిలోని ఒక సాంగ్ ద్వారా ట్రోల్ కు గురైంది. మలయాళం నటి, గాయనీ పవిత్ర మీనన్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పందంగా మారింది. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ పరమ్ సుందరి. ఈ చిత్రానికి తుషర్ జలోట దర్శకత్వం వహించారు. ఛావా చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్ లో పరమ్ సుందరి చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. దినేశ్ విజన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సచ్చిన్ జిగర్ సంగీంతం అందించారు. ఆగస్టు 29న ఈ చిత్రం హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. మూవీ నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూనే వస్తున్నారు.

అయితే, రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ లో జాన్వీ కపూర్ లుక్, భాష, మాండలికం అందరినీ ఆకట్టుకుంది. ఇక మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ అలరించబోతోంది. అయితే దీనిపై మలయాళం నటి, సింగర్ పవిత్ర మీనన్ స్పందించారు. ఆ చిత్రంలో మలయాళం అమ్మాయి పాత్రకు మలయాళం యాక్టర్ ను తీసుకోనందుకు అక్కసు వెల్లగక్కింది. జాన్వీ కపూర్ భాష, దుస్తుల తీరును విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇక మలయాళం అభిమాని ఒకరు జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచారు.
సింగర్ పవిత్రా మీనన్ పెట్టిన పోస్ట్ ను వెంటనే డిలీట్ చేయాలని ఇన్ స్టా గ్రామ్ లో రిపోర్ట్ చేశారు. దీంతో టెక్నీకల్ టీమ్ ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కు వ్యతిరేకం ఏమీ లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని కూడా స్క్రీన్ షార్ట్ తీసి సింగర్ పవిత్రా మీనన్ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఇక జాన్వీ కపూర్ ను ఇలా వ్యతిరేకించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరనన దేవర : పార్ట్ 1 చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ దేవర పార్ట్ : 2లోనూ నటించబోతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ AA22xA6 ప్రాజెక్ట్ లోనూ ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన అప్డేట్ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











