నా కెరీర్ మనోజ్ వల్లే ఇలా అయ్యింది.. అసలు విషయం చెప్పిన మంచు లక్ష్మి

టాలీవుడ్ లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరియం అయిన సంగతి తెలిసిందే. స్టార్ కిడ్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేసింది. ఆమెకు స్టార్ హీరోయిన్ గా, స్టార్ నటిగా స్టేటస్ రాకపోయినా తన చిత్ర పరిశ్రమలో కీలకమైన బాధ్యతలను చూసింది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా, టెలివిజన్ షోస్ కు హోస్ట్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకులను అలరించింది. తనదైన శైలిలో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ వస్తోంది.

ఇప్పటికీ మంచు లక్ష్మి ప్రసన్న తన కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో తన రాబోయే చిత్రం దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలిసి మచు లక్ష్మి మాట్లాడారు. తన వెంటనే తమ్ముడు మంచు మనోజ్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Manchu Lakshmi said that how she get into the film Industry

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నన్ను చిత్ర పరిశ్రమలోకి లాగిందే మంచు మనోజ్. వాడి వల్లనే నేను ప్రొడ్యూసర్ గా మారాను. మొదటగా నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రం నేను మీకు తెలుసా, ఆ తర్వాత ఝుమ్మంది నాధం వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఆ తర్వాత ఊకొడుతారా ఉలిక్కి పడతారా వంటి సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తూనే వచ్చాను. ఇలా మనోజ్ వల్లనే మోస్ట్లీ ఇండస్ట్రీలో లాక్ అయ్యారు. నాకూ ఈ విషయం ఇప్పుడే అర్థం అయ్యింది.

ఇప్పుడు మనోజ్ మిరాయ్ చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా విలన్ గా మారిపోయాడు. భవిష్యత్ లో వాడితో మళ్లీ సినిమా తీస్తాను. ఇప్పుడు రెమ్యునరేషన్ కాస్తా పెంచేసినా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను. ఇక నేను సినిమాలకు అస్సలు దూరంగా ఉండటం లేదు. తెలుగులో సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. బాలీవుడ్ లో ఆఫర్స్ ఉన్నాయి. అక్కడ బిజీగా ఉన్నాను. ఇక తెలుగు సినిమాల్లో బయటి నుంచి తీసుకొచ్చిన వారిని పెట్టుకుంటున్నారు. ఇక్కడే ఉన్న తెలుగు ఆర్టిస్ట్ లను మాత్రం తక్కువ అంచనా వేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఉంది. తెలుగులో నేను నటించిన చిత్రాల్లో నాకు ఫేవరేట్ ఫిల్మ్ గుండెల్లో గోదారి. ఇక నేను నెక్ట్స్ దక్ష అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో నాన్న మోహన్ బాబు గారు కూడా కీలక పాత్ర పోషించారు. నేను మా నాన్న గారి నుంచి ఎప్పుడైనా నేర్చుకునేది ఒకటే క్రమ శిక్షణ. ఆ విషయంలో అస్సలు మార్పులు ఉండవని చెప్పారు. సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నైజాం వారు, ఆంధ్రా, సీడెడ్ లో చాగంటి ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తున్నారని చెప్పింది.

More from Filmibeat

Read more about: manchu lakshmi manchu manoj mirai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X