Don't Miss!
- News
వివేకా హత్యకేసులో సంచలనం- ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు: 11 గంటలకు..!!
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
వైరల్ అవుతున్న మంచు లక్ష్మి లిప్ లాక్ సీన్.. కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా.. షాకింగ్ రొమాన్స్
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నటిగా కూడా కొన్ని సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంది. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ తో కూడా ఆమె ఎంతగానో మెప్పించింది. అయితే ఇప్పుడు ఆమె విభిన్నంగా ఒక రొమాంటిక్ పాత్రలో కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా మలయాళం సినిమాలో ఆమె ఒక లెస్బియన్ గా కనిపించిన విధానం వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే..

నటిగా మంచి క్రేజ్
మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగు పెట్టింది. అయితే ఆ రూట్లో మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక నటిగా కెరీర్ ను మొదలు పెట్టిన తర్వాత ఆమె స్థాయి మరికొంత పెరిగింది అనే చెప్పాలి. అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఆమె చేసిన విలన్ పాత్ర కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి అనే సినిమాతో కూడా ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మాన్‌స్టర్ సినిమాలో స్పెషల్ రోల్
ఇక చాలెంజింగ్ పాత్రలు చేయడమంటే తనకు చాలా ఇష్టమని లక్ష్మీ మంచు కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఎవరు ఊహించని బోల్డ్ పాత్రలలో కూడా కనిపించడానికి ట్రై చేస్తోంది. దొంగాట సినిమా నుంచి ఆమె ఎంచుకుంటున్న పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటున్నాయి. ఇక ఈ మధ్య హడావిడి తగ్గింది అని అనుకుంటున్న సమయంలోనే మలయాళంలో మాన్‌స్టర్ అనే సినిమాలో ఊహించని పాత్రలో కనిపించింది.

ఓటీటీ రిలీజ్
మోహన్ లాల్ కథానాయకుడుగా నటించిన మాన్‌స్టర్ సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మంచు లక్ష్మి ఒక అనాధ అమ్మాయిల కనిపిస్తుంది. ఆమెతో పాటు మరో ప్రముఖ నటి హాని ఫోజ్ కూడా అదే తరహా పాత్రలో నటించింది.

లెస్బియన్ పాత్రలో లిప్ కిస్
అయితే హనీ రోజ్ మంచు లక్ష్మి పాత్రలు ఊహించని విధంగా ఉన్నాయి. కథలో ఆ ఇద్దరు కూడా అనాధలు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు నేరాలకు పాల్పడుతూ ఉంటారు. అంతేకాకుండా శారీరకంగా లెస్బియన్ తరహాలో వారు శృంగారంలో కూడా పాల్గొంటారు. ఇక వారిద్దరూ లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించారు. మంచు లక్ష్మీ ఇలాంటి రొమాంటిక్ లెస్బియన్ పాత్రలో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇలాంటి పాత్రలంటే సరదా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మంచి లక్ష్మి హాని రోజే కు సంబంధించిన లిప్ లాక్ స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. అసలు అందులో నిజంగా మంచు లక్ష్మీ నటించిందా లేదా అనేలా అందరూ కామెంట్ చేస్తున్నారు. అంతలా సరికొత్త పాత్రలో ఆమె షాక్ ఇచ్చింది. అయితే తనకు ఇలాంటి చాలెంజింగ్ పాత్రలు చేయడం సరదా అని అలాగే ట్రోల్స్ చేసేవారికి నేనే హెల్ప్ అవుతుంటానని కూడా ఆమె రివర్స్ కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది.