బాహుబలి రేంజిలో మణిరత్నం పీరియడ్ మూవీ: ప్రధాన పాత్రలో ఐశ్వర్యరాయ్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ పీరియడ్ డ్రామా 'బాహుబలి' ప్రాజెక్ట్. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఓ సంచలనం. దాన్ని కొట్టే చిత్రం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.

అయితే త్వరలో బాహుబలి రేంజిలో ఓ పీరియడ్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో కూడా ఓ కీలకమైన పాత్ర చేయించేందుకు ప్రత్నిస్తున్నారని, పాపులర్ సౌత్ స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్

హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్

హిస్టారికల్ డ్రామాగా రూపొందబోయే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ కోసం ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మణిరత్నం చెప్పిన కథ, అందులో తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

వారికోసం ప్రయత్నాలు అందుకేనా?

వారికోసం ప్రయత్నాలు అందుకేనా?

తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటంతో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లాంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నారటన ఈ గ్రేట్ డైరెక్టర్.

ఆ నవల ఆధారంగా..

ఆ నవల ఆధారంగా..

ఈ మూవీ కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా రూపొందబోతోందని, మూడు భాగాలుగా ఈ ప్రాజెక్టును మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుస్తకం మొత్తం 5 భాగాలుగా ఉన్నప్పటికీ సినిమాను మూడు భాగాల్లో ఫినిష్ చేస్తారట.

బల్క్ డేట్స్

బల్క్ డేట్స్

మూడు భాగాలు, భారీ బడ్జెట్ కావడంతో పలువురు స్టార్లను బల్క్ డేట్స్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఇందులో నటించడానికి ఐశ్వర్యరాయ్ ఓకే చెప్పిందని, అమితాబ్ బచ్చన్‌ను ఓ కీలకమైన పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే ఆయన ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

సంక్రాంతికి ప్రకటన?

సంక్రాంతికి ప్రకటన?

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మణిరత్నం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X