India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jr NTR పై మరోసారి మీరా చోప్రా దారుణంగా.. భారీగా ట్రోల్ చేసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మీరా చోప్రా ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. అయితే తాజాగా మీరా చోప్రా నటించిన చిత్రం సేఫ్ట్ (Safed) సినిమా ప్రమోషన్ కేన్స్‌లో వైభవంగా జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కేన్స్ వేదికపై ఆవిష్కరించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో కేన్స్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన #askmeera అనే హ్యాష్ ట్యాగ్‌తో తన ఫాలోవర్స్, అభిమానులతో ముచ్చటించింది. అయితే ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నలకు దాటవేయడానికి ప్రయత్నించడంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఘాటుగా స్పందించారు. నెటిజన్లతో మీరా చోప్రా సంభాషణ ఎలా సాగిందంటే..

   ఎన్టీఆర్ గురించి వివాదాస్పదంగా

  ఎన్టీఆర్ గురించి వివాదాస్పదంగా


  గతంలో నెటిజన్లతో మీరా చోప్రా ట్విట్టర్‌లో సంభాషించిన సమయంలో ఎన్టీఆర్ గురించి మీ మనసులో మాట చెప్పమని అడిగితే.. నాకు ఆయన ఎవరో తెలియదు అని మీరా చోప్రా సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో అత్యంత వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆమెను ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం దేశవ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ గురించి అభిప్రాయం చెప్పమని కోరగా.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించడం గమనార్హం.

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్స్


  అయితే కొందరు నెటిజన్లు పదే పదే ఎన్టీఆర్ గురించి, తారక్ సార్ గురించి ఒక్క మాట చెప్పు అంటే సమాధానం దాటవేసింది. దాంతో వద్దు బ్రదర్.. దానిని అడగవద్దు. ఆది ఒక్క అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. చాలా మంది నెటిజన్లు ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నలను పట్టించకోకపోవడంతో కొందరు హర్ట్ అయ్యారు. ఆమెను కొందరు బూతులతో ట్రోల్ చేశారు.

   మహేష్ బాబు నా అభిమాన నటుడు

  మహేష్ బాబు నా అభిమాన నటుడు


  టాలీవుడ్‌లో మీ అభిమాన నటుడు ఎవరు అని అడుగగా.. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చింది. అయితే సర్కారు వారి పాట సినిమాను చూశారా? మీకు ఎలా అనిపించింది అంటే ఇంకా నేను చూడలేదని జవాబు ఇచ్చింది. అయితే మహేష్ బాబు గురించి మరో మాట చెప్పమని అడిగితే.. ఆయన అందగాడు అంటూ నెటిజన్లకు తన మనసులోని మాటను చెప్పింది.

  ప్రభాస్ గురించి

  ప్రభాస్ గురించి


  ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పమని అంటే.. గ్రేట్ యాక్టర్.. ఆకర్షణీయంగా కనిపిస్తాడు అని మీరా చోప్రా చెప్పింది. అలాగే విజయ్ గురించి చెప్పమంటే.. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని, రాంచరణ్ గురించి చెప్పమంటే.. RRR మూవీలో అతడి ఫెర్ఫార్మెన్స్ చూసి లవ్‌లో పడ్డాను అని మీరా చెప్పింది. అలాగే సమంత గురించి చెప్పమంటే.. అమేజింగ్ అంటూ తన మనసులోని మాటను చెప్పింది.

  పవన్ కల్యాణ్‌తో నటించాలని ఉందంటూ

  పవన్ కల్యాణ్‌తో నటించాలని ఉందంటూ


  అలాగే పవన్ కల్యాణ్‌తో మరోసారి నటించాలని ఉందా అనే ప్రశ్నకు మీరా చోప్రా సమాధానం చెబుతూ.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు నటించడానికి.. ఎల్లప్పుడూ ఎదురు చూస్తు ఉంటాను అని మీరా చోప్రా తెలిపింది. భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలో నటించే అవకాశం వస్తే.. నటిస్తావా అంటే.. రెడీ అంటూ జవాబిచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ ఎప్పుడు వస్తారు అని మరో నెటిజన్ అడిగితే.. హమ్మయ్య అంటూ నిట్టూర్పు విడిచింది. మీరు ఏదైనా తెలుగు సినిమా చేస్తున్నారా అంటే.. నో అంటూ క్లుప్తంగా జవాబిచ్చింది.

   మీరు ఎవరంటూ మీరా చోప్రాకు తింగరి ప్రశ్న

  మీరు ఎవరంటూ మీరా చోప్రాకు తింగరి ప్రశ్న


  మీరాచోప్రాను ఇరిటేట్ చేయడానికి నెటిజన్లు పలు విధాలుగా ప్రయత్నించారు. ఓ నెటిజన్ తుంటరిగా వ్యవహరిస్తూ.. మీరు ఎవరో నాకు తెలియదు. మీ గురించి మాకు చెప్పండి అంటే.. గూగుల్‌లో నా గురించి వెతకండి.. అంతా తెలుస్తుంది అని ఘాటుగా సమాధానం చెప్పింది. ఇలా పలు ప్రశ్నలకు తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేసింది.

  English summary
  Actress Meera Chopra ignores Jr NTR in Ask Meera Chat in Twitter. She is coming with safed movie which its first look unveiled at Cannes. In this occassion, She organised askmeera in twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X