twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనా బయోపిక్, బాహుబలి రైటర్ సపోర్ట్.. ఒక్కొక్కరికీ చుక్కలే?

    |

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ త్వరలో తన జీవితకథను బయోపిక్ రూపంలో తెరపైకి తేబోతున్నారు. అంతే కాదు తన బయోపిక్ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నారు. దీనికి స్క్రిప్టు రాసేది మరెవరో కాదు.. బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్. కంగనా లేటెస్ట్ మూవీ 'మణికర్ణిక' చిత్రానికి కూడా ఈయనే కథ అందించారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. కంగనా రనౌత్ నటిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో.. ఆమె జీవితంలో అదే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. ఈ బయోపిక్ ద్వారా ఆమె తన వ్యతిరేకులకు చుక్కలు చూపించబోతున్నారనే చర్చ మొదలైంది

    ఎలాంటి ప్రొపగండా లేదంటున్న కంగనా

    ఎలాంటి ప్రొపగండా లేదంటున్న కంగనా

    ‘మణికర్ణిక తర్వాత నా జీవిత కథతో తెరకెక్కబోయే చిత్రానికి నేను దర్శకత్వం వహించబోతున్నాను. అయినే ఈ బయోపిక్ వెనక ఎలాంటి ప్రొపగండా లేదు. ఇది కేవలం నా జర్నీగురించి చెప్పే ప్రయత్నం మాత్రమే, నా ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలు ఇందులో ఉంటాయి' అని కంగనా తెలిపారు.

    ఎవరూ నన్ను జడ్జ్ చేయలేదు

    ఎవరూ నన్ను జడ్జ్ చేయలేదు


    నా చుట్టు ఉన్నవారు నన్న జడ్జ్ చేయకుండా నేను ఎలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేశారు. వారు నన్ను ఎంతో ప్రేమించడం వల్లే నేను ఇంత ధైర్యంగా ఈ స్థాయి వరకు వచ్చానని కంగనా వ్యాఖ్యానించారు.

    ముందు భయపడ్డాను

    ముందు భయపడ్డాను

    12 వారాల క్రితం విజయేంద్రప్రసాద్ స్వయంగా కంగనా వద్దకు వచ్చిన... ఆమె జీవిత కథ రాస్తానని అడిగారట. ఆయన ఈ ప్రతిపాదన తేగానే ముందు భయపడ్డాను. అదే సమయంలో అంత గొప్ప రచయితపై నమ్మకం కూడా ఉంది. వెంటనే విజయేంద్ర సర్‌ను ప్రాజెక్ట్ మొదలు పెట్టమని చెప్పినట్లు కంగనా తెలిపారు.

    వారి పేర్లు బయట పెట్టబోము

    వారి పేర్లు బయట పెట్టబోము

    ఈ సినిమా తన జీవితంలోని వివిధ కోణాలను ఫోకస్ చేస్తుందని, కానీ తనతో గతంలో విబేధించిన వ్యక్తుల పేర్లను ఇందులో ప్రస్తావించబోమని కంగనా స్పష్టం చేశారు. అయితే వారెవరూ లేకుండా నా జర్నీ చూపించడం సాధ్యం కాదు. అందుకే పేర్లు ప్రస్తావించకూడదని నిర్ణయించుకున్నాం. నా జీవితంలోని ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు ఇందులో ప్రధానంగా ఉంటాయన్నారు.

    అదే ప్రధాన ఇతివృత్తం

    అదే ప్రధాన ఇతివృత్తం

    ఒక పర్వత ప్రాంతం నుంచి సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని ఒక అమ్మాయి గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనను తాను ఎలా నిరూపించుకుంది అనే ప్రధాన ఇతివృత్తంతో తన బయోపిక్ ఉంటుందని కంగనా తెలిపారు.

    English summary
    "My own story is the subject of my next directorial. But it is not propaganda film with characters who are starkly black and white, rather it is a sincere, heartfelt account of my journey so far with plenty of lighter moments," Kangana Ranaut said in a statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X