శోభిత నలభిమపాకం.. నాగచైతన్య హిల్లేరియస్ కామెంట్ ఏమిటో తెలుసా?
అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా నటి శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైతూకు ఇది సెకండ్ మ్యారేజ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఇప్పుడు వీరిద్దరూ సరికొత్త లైఫ్ ను ప్రారంభించారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న ప్రేమను ఏకంగా సోషల్ మీడియాలో వేదికల్లోనూ పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకున్నారు. ఇలా తాజాగా శోభితా ధూళిపాళ తన అభిమానులతో పంచుకున్న కొన్ని వీడియోలపై భర్త నాగ చైతన్య ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ శోభితా ధూళిపాళ మంగళవారం తన రాబోయే చిత్రం షూటింగ్ సెట్ లో సందడి చేసింది. తన తదుపరి ప్రాజెక్ట్ సెట్స్‌లో వంట చేస్తున్న ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఆ ఫొటోలు, వీడియోల్లో శోభితా ధూళిపాళ ఏకంగా వంట మనిషిలాగా మారిన రుచిరకరమైన వంటలను వండింది. ప్రతి వంటకాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తూ కనిపించింది. ఆ పోస్టుకు శోభితా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. సర్వైవల్ స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది. అలాగే తన రాబోయే చిత్రాన్ని సంబంధించిన సెట్ లో షూటింగ్ ప్రారంభానికి ముందు ఇలా వంట చేశానని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా శోభితా వంట చేస్తున్న అనేక చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేసింది. ఒక వీడియోలో తను సలసల మరిగిస్తున్న పప్పు సాంబార్ ను కలియబెడుతూ కనిపించింది. మరొక ఫొటోలో ఆమె కొన్ని బెండకాయలను కోసుకుంటున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలను రుబ్బుకోవడానికి సాంప్రదాయ రోకలిని కూడా ఉపయోగించడం విశేషం. ఇలా ఒక్కసారిగా అక్కినేని కోడలు పల్లెటూరి అమ్మాయిలా అన్ని వంటలు చేస్తుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
ప్రతి మనిషికి ప్రాథమిక మాన నైపుణ్యాలు ఉండాలని సూచించింది. ఇక గతంలో నాగచైతన్య తనపై చేసిన కామెంట్స్ కు, తనలో సర్వైవింగ్ సిల్స్ లేవని చెప్పడంతో ఇలా బదులిచ్చింది. అయితే ఈ పోస్ట్ కు అక్కినేని నాగ చైతన్య కూడా స్పందించడం విశేషం. ఈ వంటకాలను రుచి చూడటానికి ఎదురు చూస్తున్నానని కామెంట్ చేశారు. అయితే గతంలో శోభితాకు వంట రాదని చెప్పిన నాగచైతన్య ఇప్పుడు శోభితా ఇలా వంటలు చేస్తూ కనిపించడంతో ఆ పదార్థాల రుచి చూడాలని ఊవ్విల్లూరాడు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక నాగచైతన్య సమంత రూత్ ప్రభుతో 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య శోభితా ధూత అనే వెబ్ సిరీస్ సమయంలో కలిశారు. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. ఇక 2024 డిసెంబర్ లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా టూర్లకు, వేకేషన్లకు వెళ్తూ సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. అలాగే తమ రాబోయే చిత్రాలపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











