22 Years of Nayanatara: అలాంటి అనుభవాలే.. నేనేంటో రుజువు చేశాయి.. నయనతార ఎమోషనల్
Nayanatara: నయనతార .. దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్. గత రెండు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోలతో జోడీగా నటించి మెప్పించడమే కాకుండా, తన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తన 22 ఏండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ నయనతార ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇంతకీ నయనతార ఏమన్నారంటే..?
నయనతార 2003లో మలయాళ చిత్రం 'మనస్సినక్కరే' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతో మంచి పేరు రావడంతో వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తో నటించే అవకాశం కొట్టేసింది. అలా చంద్రముఖి సినిమాలో నటించింది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నయనతార. ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది.

నయనతార ఎంతలా పెరిగిపోయిందంటే.. ఒక్కప్పుడు వేలల్లో రెమ్యూనరేషన్ తీసుకునే ఈ అమ్మడు.. ఒక్కొక్క సినిమాకు 5 నుండి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు వెళ్లారు. సౌత్ ఇండస్ట్రీని ఏలేసి ఈ అమ్మడు..రీసెంట్‌గా బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు. షారుఖ్ ఖాన్‌తో నటించిన 'జవాన్' సినిమా ద్వారా అంతర్జాతీయంగా తన ప్రతిభను చాటారు. ఈ సినిమా క్రేజ్ తో 'లేడీ సూపర్‌స్టార్' మారారు. ప్రస్తుతం చేతిలో 8 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, అందులో చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే 'మన శంకరవరప్రసాద్' సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఇదిలాఉంటే.. నయనతార తన 22 ఏండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక ఎమోషనల్ నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు. "మొదటిసారి కెమెరా ముందు నిలిచిన నాటి నుంచి 22 ఏళ్లు పూర్తయినాయి. అప్పుడప్పుడే సినిమాలే నా ప్రపంచం అవుతాయని అనుకోలేదు. పరిశ్రమలోని ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చింది, ధైర్యం ఇచ్చింది. అలాంటి అనుభవాలే.. నేనేంటో రుజువు చేశాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను" అని పేర్కొన్నారు.
ఇక పర్సనల్ లైఫ్‌లోనూ నయనతార విశేషం. 2022లో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలకే సరోగసీ ద్వారా జంటకు ఇద్దరు పండంటి మగ బిడ్డలు జన్మించారు. ప్రస్తుతం నయనతార చేతిలో టాక్సిక్, డియర్ స్టూడెంట్స్, టెస్ట్ వంటి చిత్రాలు ఉన్నాయి. అరడజన్‌కు పైగా ప్రాజెక్ట్‌లు తీసుకుని, మలయాళం, తమిళం, కన్నడలో కొనసాగుతున్న ప్రాజెక్ట్స్‌తో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. నయనతార తన నటనతో, క్రేజ్‌తో, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో నయనతార సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నిలిచారన్నడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications











