For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇస్మార్ట్ బ్యూటీకి సూపర్‌స్టార్ సోదరి బంపర్ ఆఫర్.. గ్రాఫ్ లేకున్నా ఫేట్ బాగుంది!

  By Manoj
  |

  అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ హీరోయిన్ మాత్రం అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ అమ్మడు పూరీ జగన్నాథ్ దృష్టిలో పడడంతో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా ఆమెకు మొదటి హిట్ వచ్చింది. ఇక, తాజాగా ఈ అమ్మడు మరో అవకాశాన్ని పట్టేసింది. ఇందులో ఆమె ఊహించని రీతిలో రెమ్యూనరేషన్ అందుకోబోతుంది. ఇంతకీ ఆమె ఏ సినిమాలో ఛాన్స్ పట్టేసింది..? ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.?

  నిధి అగర్వాల్ మన అమ్మాయే

  నిధి అగర్వాల్ మన అమ్మాయే

  నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్‌లోనే. మార్వాడి కుటుంబానికి చెందిన ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు షిఫ్ట్ అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత నిధి.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 2017లో ఓ హిందీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

  గ్లామర్ షోతో ప్రత్యేక గుర్తింపు

  గ్లామర్ షోతో ప్రత్యేక గుర్తింపు

  నిధి అగర్వాల్‌కు అవకాశాలు వచ్చింది తక్కువే అయినా.. ఆమె తన అందంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. గ్లామర్ షోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే నిధి.. తరచూ తన ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

  హిట్‌తో ఎన్నో వస్తాయనుకుంటే...

  హిట్‌తో ఎన్నో వస్తాయనుకుంటే...

  పూరీ జగన్నాథ్ - రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్' ఎంతటి విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్‌కు ఎన్నో ఆఫర్లు వస్తాయనుకున్నారంతా. కానీ, ఆమెకు మాత్రం భిన్నంగా జరిగింది. ప్రస్తుతం కేవలం ‘భూమి' అనే ఓ తమిళ సినిమా మాత్రమే చేస్తోంది.

  తెలుగులో ఉన్నది అదే

  తెలుగులో ఉన్నది అదే

  సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే, మహేశ్ సోదరి పద్మావతి గల్లా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఎంపికైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

  బంపర్ ఆఫరిచ్చిన మహేశ్ అక్క

  బంపర్ ఆఫరిచ్చిన మహేశ్ అక్క


  ఈ సినిమా ప్రారంభోత్సవం నవంబర్ 10న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో నటించడానికి గానూ నిధి అగర్వాల్‌కు రూ. కోటి రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట. దీంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె కెరీర్ గ్రాఫ్ బాగోలేకున్నా అదృష్టం మాత్రం బానే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Bollywood girl Nidhi Aggerwal debuted in Tollywood with Savyasachi and later appeared in Mr Majnu, both the movies flopped and even she hasn't got any name for them. But her glamour treats offered on Instagram and those hot dancing videos of her have made Tollywood producers run for her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X