For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపోయిన నిహారిక.. మెగా డాటర్ వెరీ వెరీ హాట్!! గతంలో ఎన్నడూ ఇలా చూసుండరు

  |

  మెగా డాటర్ నిహారిక ఉన్నట్టుండి ఫుల్లుగా రెచ్చిపోయింది. ఇప్పటిదాకా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆకట్టుకున్న ఈ మెగా హీరోయిన్.. తనలో కూడా కావాల్సినంత హాట్‌నెస్ ఉందని తెలిపేలా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. ఆమె పెట్టిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  పాపులారిటీ తెచ్చుకోకున్నా.. అలా మాత్రం

  పాపులారిటీ తెచ్చుకోకున్నా.. అలా మాత్రం

  మెగా ఫ్యామిలీ నుంచి సినీ గడపతొక్కిన నిహారిక.. తన అందంతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. భారీ పాపులారిటీ తెచ్చుకోకున్నా.. వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో అభిమానులకు దగ్గరైంది. కాకపోతే వెండితెరపై ఇప్పటివరకు ఆమెకు విజయం దక్కకపోవడం కాస్త నిరాశ కలిగించింది.

  నిహారిక సినీ ప్రయాణం.. ఫలితం

  నిహారిక సినీ ప్రయాణం.. ఫలితం

  కొణిదెల నిహారిక లీడ్ రోల్‌లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. ''ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్'' సినిమాల తర్వాత 'సూర్యకాంతం' సినిమా చేసింది ఈ మెగా డాటర్. బట్ ఏ ఒక్క సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేదు. దీంతో క‌నీసం క‌థ‌ల ఎంపిక కూడా నిహారికకు చేతకావ‌డం లేదంటూ విమ‌ర్శ‌లు వచ్చాయి.

   ఇక లాభం లేదనుకున్న మెగా డాటర్

  ఇక లాభం లేదనుకున్న మెగా డాటర్

  అయితే ఇది గమనించి నిహారిక.. ఇక లాభం లేదని వెబ్ సీరిస్ లపై ఫోకస్ పెట్టి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ని నమ్ముకుంటూ ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

  నిహారిక స్పెషల్ కిక్.. వెరీ వెరీ హాట్

  నిహారిక స్పెషల్ కిక్.. వెరీ వెరీ హాట్

  ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారిక తన హాట్ పిక్స్ షేర్ చేసింది. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఆమె వెరీ వెరీ హాట్ దుస్తుల్లో కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా నిహారిక గ్లామర్ చూసి ఇకపై ఆమెకు వరుస ఆఫర్స్ ఖాయం అంటున్నారు నెటిజన్లు.

  మెగా డాటర్ సెక్సీ లుక్‌.. నెటిజన్స్ కామెంట్స్

  మెగా డాటర్ సెక్సీ లుక్‌.. నెటిజన్స్ కామెంట్స్

  సాధారణంగా సెక్సీ ఫోజులకు, హాట్ డ్రెస్సులకు దూరంగా ఉండే మెగా డాటర్ ఒక్కసారిగా సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చే సరికి ఆశ్చర్యపోయారు మెగా ఫ్యాన్స్. నెట్టింట తెగచక్కర్లు కొడుతున్న ఈ పిక్ చూసి భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

  నిహారిక డిసీజన్.. అందుకే ఇకపై

  నిహారిక డిసీజన్.. అందుకే ఇకపై

  మరోవైపు సినిమాలకు నిహారిక బై బై చెప్పేసి కేవలం వెబ్ సిరీస్ లపై మాత్రమే దృష్టి సారించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. నటిగా తానేంటో నిరూపించుకోవాల‌నే క‌సితోనే సినిమాల్లోకి వచ్చిన ఆమెకు పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఇలా నిర్ణయించుకుందని సమాచారం.

  చిరంజీవి, నాగ‌బాబుకు చెప్పి మరీ

  తాను తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని చిరంజీవి, నాగ‌బాబుకు కూడా చెప్పేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ప్రస్తుతం నిహారిక ఫోకస్ అంతా ఆన్‌లైన్ వేదికలపై పెట్టిందని అంటున్నారు. ఇప్ప‌టికే 'పింక్ ఎలిఫెంట్' పేరుతో నిర్మాణ సంస్థ‌ను కూడా ప్రారంభించిన నిహారిక.. ఇదే బ్యానర్‌పై 'నాన్నకూచి', 'ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్' వెబ్ సిరీస్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే.

  English summary
  Mega Daughter Niharika Konidela shared her sexy photos in instagram. In this pic Niharika looks more glamaour and this pic is getting mixed comments from the netijans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X