నిహారిక కొణిదెల సంచలన నిర్ణయం.. అలా ఎందుకు డిసిషన్ తీసుకొన్నానంటే అంటూ మెగా డాటర్
Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట యాంకర్‌గా డీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తర్వాత హీరోయిన్‌గా మారి 'ఒక మనసు' సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. నాగశౌర్య సరసన నటించిన ఈ చిత్రం ఎమోషనల్ కంటెంట్‌తో మంచి టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అనంతరం 'హ్యాపీ వెడ్డింగ్','సూర్యకాంతం','సైరా నరసింహారెడ్డి' వంటి చిత్రాల్లో నటించి, మెప్పించింది. కానీ, ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. నిహారిక 2020లో సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను వివాహం చేసుకుంది. ఘనంగా జరిగిన ఈ పెళ్లి తర్వాత, కొద్దికాలానికే వీరిద్దరి సంబంధం సర్దుబాటు కాలేక విడాకులతో ముగిసింది. తన వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ సూటిగా మాట్లాడే నిహారిక, డివోర్స్ అనేది ఎవరికీ కావాలని ఉండదని చెప్పి అందరినీ ఆలోచనలో పడేసింది. ఇటీవలీ సమయంలో కూడా నిహారిక వెనుకడుగు వేయకుండా కొత్త దారిని ఎంచుకుంది. నటిగా అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా మారి తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను ప్రారంభించింది.

మొదట వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంది. తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా వచ్చిన ఆమె, 'కమిటీ కుర్రాళ్లు' సినిమాను నిర్మించింది. దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. నిర్మాతగా తన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో నిహారిక ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా కూడా తన స్థానం సంపాదించుకుంది. తాజాగా నిహారిక కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. ఇందులో సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక పాల్గొంది. అందులో కొన్ని నెలల నుండి చాలా స్లిమ్ గా, లుకింగ్ ఫెయిర్ గా కనిపిస్తున్నారు. ఏంటి మీ బ్యూటీ సీక్రెట్? ఈ ట్రాన్స్ఫర్మేషన్ కు కారణమేంటీ ప్రశ్నించగా.. 'ముందుగా నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్న, అలాగే నేను చాలా బరువు పెరిగాను, ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా చాలా బరువు పెరిగాను. దీంతో నెమ్మదిగా అయినా సరే వెయిట్ లాస్ కావాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను. అది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. కేవలం సన్నగా అయ్యేంతవరకు జిమ్ కు వెళ్లాలని కాకుండా.. ఇక దానిని నా డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఎప్పుడైతే మనం శారీరకంగా దృఢంగా ఉంటామో.. మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. దాంతో స్వచ్ఛమైన ఆలోచనలు. మంచి జీవితాన్ని కొనసాగించడానికి తోడ్పడుతాయి అంటూ తాను తీసుకున్న సంచల నిర్ణయాన్ని నిహారిక వెల్లడించింది.
అలాగే.. తన ఫుడ్ డైట్ సీక్రెట్ ను కూడా పంచుకుంది. "నేను రెగ్యులర్‌గా డైట్ చేయను. కానీ ప్రస్తుతానికి డైట్‌లో ఉన్నాను. అందుకే ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం చేస్తాను. నేను తినేది గుడ్డు, చికెన్, డైట్ బిర్యానీ. ఇవే నా డైట్ సీక్రెట్స్" అని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల తర్వాత కూడా నిహారిక వెనక్కి తగ్గకుండా కొత్త దారిలో అడుగులు వేసింది. నటిగా కాకపోయినా నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అనుభవాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది.


Click it and Unblock the Notifications











