మరణానికి ముందు చివరి సారిగా... నిహారిక పోస్ట్ వైరల్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక కొణిదెల. బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఆమెకు లాంచింగ్ వరకు మాత్రమే ఉపయోగపడింది. హీరోయిన్ అవుదామని ఎన్నో కలలు కన్నప్పటికీ ఆమె నటిగా సక్సెస్ కాలేకపోయింది. వైవాహిక జీవితంలోనూ కలతలు రావడంతో కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం నిర్మాతగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు నిహారిక. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా నిరాశ
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక.. తొలుత బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిహారిక తొలి సినిమాకే డిజాస్టర్‌ను అందుకున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి తదితర సినిమాలలో నటించారు. ఇవి కూడా అంతగా సక్సెస్ కాలేదు. కెరీర్‌లో నిలదొక్కుకోకముందే నిహారికకు పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయించారు.

చైతన్యతో పెళ్లి, విడాకులు
ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగగా.. అనూహ్యంగా ఈ జంట మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో చైతన్య, నిహారికలు విడాకులు తీసుకున్నారు. ఇది ఆమె జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది. కొన్నాళ్లు బయటకు రాని నిహారిక.. తిరిగి తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలపై దృష్టి సారించిన మెగా డాటర్.. తల్లిదండ్రులు, మెగా ఫ్యామిలీ సహకారంతో ప్రొడ్యూసర్‌గా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు నిర్మించి గుర్తింపు సంపాదించింది.
నిర్మాతగా బిజీ
ఇక కమిటీ కుర్రోళ్లు సినిమాతో వెండితెరపై తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా విజయాన్ని అందుకున్నారు నిహారిక. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్ధర్ అవార్డ్ కూడా స్వీకరించారు. ప్రస్తుతం నిహారిక నిర్మాణ సంస్థ నుంచి వెబ్ సిరీస్‌లు, సినిమాలు రానున్నాయి. ఇటీవల తన మిత్రులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు నిహారిక. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేస్తున్నారు. వీటితో దేవాలయాలు కూడా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షేరుతో కలిసి ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు నిహారిక.
సంచలన పోస్ట్
వర్షాకాలం కావడంతో తన మిద్దెపై వర్షంలో తడుస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. మొన్నామధ్య వర్షంలో తడుస్తున్న వీడియోను షేర్ చేసిన నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వర్షంలో హైదరాబాద్ నగర అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. నా ఫ్రెండ్ చెప్పినట్లు ఇదంతా హీరోయిన్ చనిపోయే ముందు చివరి సీన్‌లా ఉంది.. నా ఫేస్‌లో అటెన్షన్ ఎలా ఉందో చూడాలంటే చివరి వరకు ఉండాల్సిందేనని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిహారికకు ఏమైంది? ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











