సీక్రెట్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరో హీరోయిన్లు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి సీక్రెట్‌గా ఉంచుతున్న తమ రిలేషన్స్‌ని కొందరు హీరో, హీరోయిన్లు బయటపెట్టేస్తున్నారు. బ్యాచిలర్‌ లైఫ్‌కు ఎండ్ కార్డ్ పెట్టేస్తూ ఓ ఇంటివారు అవుతున్నారు. తాజాగా ఈ కోవలోకే వస్తారు హీరోయిన్ నివేదా పేతురాజ్. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా
తమిళనాడులోని మధురైకి చెందిన నివేదా పెతురాజ్. దుబాయ్‌, లండన్‌లలో చదువుకున్నారు. చదువు తర్వాత మోడలింగ్‌లోకి దిగిన నివేదా.. మిస్ ఇండియా యూఏఈ పోటీలలో విజయం సాధించారు. తర్వాత మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015 పోటీలలో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించారు. ఈ కాంటెస్ట్‌లో టాప్ 5లో నిలిచారు. అనంతరం సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన నివేదా 2016లో ఓరు నాల్ కూతు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 2017లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగువారిని పలకరించారు.

Nivetha Pethuraj set to marry rajhith ibran here are the groom s details

బ్యాడ్మింటన్ ప్లేయర్
చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, బ్లడ్ మేరి, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ, బూ సినిమాలలో నటించారు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు మాత్రం విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమెకు అంతగా అవకాశాలు రాకపోవడంతో నివేదా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నివేదా థామస్ మల్టీటాలెంటెడ్ ఈమెలో ఓ యాక్టర్ మాత్రమే కాదు.. ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్, రేసర్ కూడా ఉన్నారు. పలు పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డుల్ని ఆమె అందుకున్నారు.

ఫార్మూలా రేసర్‌గా ఘనత
చిన్నప్పటి నుంచి కార్లపై మోజు పెంచుకున్న నివేదా పేతురాజ్.. ఫార్ములా కార్ రేస్ ట్రైనింగ్ లెవల్ 1ని పూర్తి చేసింది. సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ తనకు వీలు కుదిరనప్పుడల్లా కారు రేసుల్లో పాల్గొంటోంది. గతంలో తనను కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లకు సంబంధించి తనను ఎంతో మంది సంప్రదించారని.. అయితే ఈ పోటీలలో పాల్గొనాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలని, డబ్బుతో పాటు ధైర్యం, రిస్క్ చేసే సామర్ధ్యం ఉంటేనే రేస్‌లలో పాల్గొనగలం. అంతేకాదు.. ఈ క్రీడల్లో పాల్గొనాలంటే ప్రతి రేసుకు ఏకంగా 15 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అందుకే ఆచితూచి కారు రేసుల్లో పాల్గొంటానని నివేదా పేతురాజ్ చెప్పింది.

ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన నివేదా
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నివేదా పెతురాజ్ .. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ముద్దగుమ్మ ఊహించని ఫోటోలతో షాకిచ్చింది. తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కాబోయే భర్తతో ఫోటో షూట్ నిర్వహించి దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. నివేదాకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్ అని తెలుస్తోంది. ఆయన వ్యాపారవేత్తగా స్థిరపడినట్లుగా తమిళ మీడియా చెబుతోంది. దుబాయ్ నుంచి తన కార్యకలాపాలను సాగిస్తూ.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో నివేదా - రాజ్‌హిత్‌ల వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: nivetha pethuraj movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X