For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తప్పులో కాలేసిన పాయల్ రాజ్‌పుత్.. అలాంటి ఫోటోలు షేర్ చేసి..

  |

  ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ నంతా తన వైపు తిప్పుకుంది. తొలి సినిమాతోనే ఈ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే ఆమె తాజాగా ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసి డిలీట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే

  ఆర్ఎక్స్ 100 సినిమాతో

  ఆర్ఎక్స్ 100 సినిమాతో


  ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా ఆమెకు ఫస్ట్ మూవీ. అయినా కూడా పాయల్ రాజ్ పుత్ ఏ మాత్రం బెదురు లేకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్లో నటించమంటే జీవించేసింది. ఒక రేంజ్ లో అందాలు ఆరబోసి బోల్డ్ రోల్ లో మెప్పించింది. అలా మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసి గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తానుఎల్లప్పుడూ సిద్ధమే అని సిగ్నల్ ఇచ్చేసింది.

  నాలుగో బాష కలిసొచ్చింది

  నాలుగో బాష కలిసొచ్చింది


  నిజానికి ఈ భామ తమిళంలో 2013లో పంజాబీ లో 2017లో ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు భాషల్లోనూ కలిసిరాలేదు. 2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో, ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు తెలుగు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలో సీత సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ లో నర్తించి మెప్పించింది.

  అవకాశాలు తగ్గుతున్నా

  అవకాశాలు తగ్గుతున్నా

  ఇక హాట్ నెస్ కి తగ్గట్టు ఆమెకు మరో రెండు మూడు సినిమా అవకాశాలు దక్కాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పిన ఆర్ డి ఎక్స్ లవ్ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత డిస్కో రాజా అనే సినిమా చేసినా అది పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఇక ఆహా కోసం అనగనగా ఒక అతిథి అనే సినిమా చేయగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

  వ్యాక్సిన్ వేయించుకుని ఫోటోలు డిలీట్

  ఇంతకీ అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ భామ వ్యాక్సిన్ వేయించుకుంది. ముందుగా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తీసుకున్న ఫొటోలు ఆమె సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసుకుంది. అందులో ఏడుస్తున్నట్లు మొహం పెట్టిన భామ ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ఈ మందులు అన్న మెడికల్ కి సంబంధించిన ఏ విషయం అయినా తనకు భయం అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని అందుకే వ్యాక్సిన్ వేయించుకున్నా అని ఆమె పేర్కొంది. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ పోస్టు ఎందుకు డిలీట్ చేసింది అనే చర్చ ఇప్పుడు మొదలైంది

  #RIPKVAnand: Allu Arjun ఎమోషనల్‌.. ప్రముఖుల సంతాపం KV Anand చిత్రాలు పెద్ద హిట్ || Filmibeat Telugu
  అప్పుడు రచ్చ జరగడంతో

  అప్పుడు రచ్చ జరగడంతో

  నిజానికి గత సెప్టెంబర్ నెలలో సినిమా షూటింగ్ మొదలవుతుంది నేపథ్యంలో షూటింగ్ స్పాట్ కి వెళ్ళాక పాయల్ రాజ్ పుత్ కి కరోనా టెస్ట్ చేశారు. ముక్కులో నుంచి శాంపిల్స్ తీస్తున్న నేపథ్యంలో ఆమె భయపడుతూ పెద్ద ఎత్తున ఏడుస్తూ కేకలు పెడుతూ హల్ చల్ సృష్టించింది. దీంతో అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

  కానీ క్షణాల్లో వైరల్

  కానీ క్షణాల్లో వైరల్


  ఇప్పుడు కూడా అలాగే ట్రోల్ చేస్తారని భావించి ఆమె ముందస్తు జాగ్రత్తగా పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే దాన్ని డిలీట్ చేసి ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది.. మరో ఆసక్తికర అంశం ఏమిటనే అవే ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ అయ్యాయి, కానీ ట్విట్టర్ ఖాతాలో దర్శనం ఇచ్చాయి. అయితే అది వెరిఫైడ్ ఖాతా కాకపోవంతో అది ఆమె ఖాతానేనా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డిలీట్ చేసినా సరే అప్పటికే ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న చాలామంది తమ తమ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశారు.. అలా మొత్తం మీద పాయల్ రాజ్ పుత్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

  English summary
  Actress Payal Rajputh who took corona vaccination today shared those pictures in her instagram official handle. but within fraction of seconds she deleted them in her instagram. But an un verified twitter account on her name shared these pictures. at present these pics gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X