సక్సెస్‌ఫుల్‌గా ఆ రాత్రి అలా గడిచిపోయింది.. పూజా హెగ్డే హాట్ అప్‌డేట్
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ ముగియగానే అందాల భామ పూజా హెగ్డే యమ బీజీగా మారిపోయింది. ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తమిళ చిత్రం షూటింగుకు వెళ్తూ ముంబైలో హాట్ హాట్ కనిపించింది. ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కిన పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజా షూటింగ్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకొంటూ..

బీస్ట్ షూటింగ్ కోసం చెన్నైకి
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న బీస్ట్ సినిమా షూటింగ్ కోసం జూలై 1 తేదీన చెన్నైలో అడుగుపెట్టింది. చెన్నైకి చేరగానే సాంగ్‌కు సంబంధించిన రిహార్సల్‌లో ఆమె బిజీగా ఉండిపోయారు. రిహార్సల్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి షూటింగ్‌కు సిద్ధమవుతున్నాను అంటూ చిన్న హింట్‌ను పూజా హెగ్డే ఇచ్చింది.

గోకులం స్టూడియోలో ఆటా.. పాటా
బీస్ట్ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను చెన్నైలోని గోకులం స్టూడియోలో షూట్ చేశారు. ఈ సినిమా కోసం స్పెషల్‌గా అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ముంబై నుంచి తెప్పించారు. ఈ షూటింగ్ సందర్భంగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పోస్టులు పెట్టారు.

జానీ మాస్టర్ కోరియోగ్రఫితో
బీస్ట్ సినిమాకు సంబంధించిన ఓ మాస్, మసాలా సాంగ్‌ను విజయ్, పూజా హెగ్డేలపై కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాటకు నృత్యాలు సమకూర్చారు. ఈ పాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే పూజా హెగ్డే సోషల్ మీడియాలో అప్‌డేట్ చేశారు. రాత్రి షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది అంటూ పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

బీస్ట్ షూటింగుతో బిజీగా పూజా హెగ్డే
బీస్ట్‌లో పాట తర్వాత కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేశారు. దాదాపు పది రోజుల పాటు కీలక సన్నివేశాలను వడపళనిలో చిత్రీకరించేందుకు ఓ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్‌ను జార్జియా, యూఎస్ఏలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెన్నైలోని గోకుళం స్టూడియోలో సెట్ వేసి పాటను చిత్రీకరించారు.
Recommended Video

భారీ ప్రాజెక్టుల్లో చిరంజీవి, ప్రభాస్‌తో
పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. బీస్ట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నది. ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. రాధేశ్యామ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఆచార్య షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఇక హిదీ చిత్రాలు సర్కస్, భాయ్‌జాన్ చిత్రాల షూటింగులో పూజా హెగ్డే పాల్గొనాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











