twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Pooja Hegde: ఒకప్పుడు 10 లక్షల రెమ్యునరేషన్.. ఇప్పుడు మాత్రం అందరి కంటే ఎక్కువే!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండియా శ్రీ మొత్తంలో కూడా ఇప్పుడు అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో పూజా హెగ్డే ఒకరు. బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూజా హెగ్డే ఇటీవల కాలంలో అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు అలాగే సినీ తారలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పూజా హెగ్డే కెరీర్ మొదట్లో ఏ స్థాయిలో పారితోషికం అందుకుంది.. అలాగే ఇప్పుడు ఏ స్థాయిలో డిమాండ్ చేస్తుంది అని వివరాల్లోకి వెళితే..

    మొదట్లోనే బ్యాడ్ లక్

    మొదట్లోనే బ్యాడ్ లక్

    పూజా హెగ్డే మొదట్లో అయితే మోడల్ గా గుర్తింపును అందుకున్న తర్వాత కొన్ని యాడ్స్ లలో నటించింది. ముఖ్యంగా ఫేర్ అండ్ లవ్లీ ద్వారానే ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు దక్కాయి. కానీ బ్యాడ్ లక్ కారణంగా కొన్ని సినిమాలు మొదట్లోనే డిజాస్టర్ అయ్యాయి. మొదట ఆమె 2013లో జీవ నటించిన తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

    మొదటి బాలీవుడ్ సినిమాతో

    మొదటి బాలీవుడ్ సినిమాతో

    ఇక 2017లో పూజా హెగ్డే నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఓకే చేయలేదు. ఎందుకంటే అప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. హృతిక్ రోషన్ తో ఆమె మొహేంజో దారో అనే సినిమా చేసింది. ఆ సినిమా సక్సెస్ అయితే అప్పట్లోనే ఆమె రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళేది. కానీ ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

    బౌన్స్ బ్యాక్

    బౌన్స్ బ్యాక్

    బాలీవుడ్ సినిమా ఫ్లాప్ కావడంతో అంతకు ముందు ఓకే చేసిన ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో నుంచి జారిపోయాయి. అడ్వాన్సులు తీసుకున్న ప్రాజెక్టులు కూడా చాలావరకు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డే కెరీర్ అక్కడితో క్లోజ్ అయింది అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ ఆమె వెంటనే అల్లు అర్జున్ డీజే సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యింది.

    వరుస విజయాలు

    వరుస విజయాలు

    ఇక డీజే సినిమా తర్వాత పూజా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేసి ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసింది. ఇక తర్వాత మహేష్ బాబుతో మహర్షి అనే సినిమా కూడా చేసింది. ఇక గత ఏడాదిలో అలవైకుంఠపురంలో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే పోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా ఆమెకు గుర్తింపు అందించింది.

    ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే?

    ఇక కెరీర్ మొదట్లో పూజా హెగ్డే కేవలం 10 లక్షల రెమ్యునరేషన్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు మాత్రం ఆమె అందరికంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకుంటుంది. అల.మ్వైకుంఠపురములో సినిమా ముందు వరకు కోటిన్నరకు పైగా పారితోషికం అందుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత ఒక్కసారిగా మూడు కోట్లకు పెంచేసింది రాబోయే మహేష్ బాబు 28వ సినిమా కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

    డిజాస్టర్స్ వచ్చినా క్రేజ్ తగ్గలేదు

    డిజాస్టర్స్ వచ్చినా క్రేజ్ తగ్గలేదు

    ఈ ఏడాది పూజా హెగ్డే రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా ఆమె క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే 2 సినిమాలు చేస్తోంది. ఒకటి రణ్ వీర్ సింగ్ తో సర్కస్ అనే సినిమా గా మరొకటి సల్మాన్ ఖాన్ తో 'కీసి క భాయ్ కిసి క జాన్' అనే సినిమాలు చేస్తోంది. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలో తెరపైకి రాబోతున్న మూడవ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మరి ఈ మూడు సినిమాలతో అమ్మడు ఇంకా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Pooja hegde birthday special and her remuneration growth with box-office hits
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X