twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pooja Hegde నన్ను ఇంటి మనిషిలా చూసుకొంటారు.. నిర్మాతపై ప్రశంసలు గుప్పించిన బుట్టబొమ్మ

    |

    ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా సంగీత్ పేరుతో ఓ వేడుకను వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ..

    హీరోయిన్‌ని అతిథిగా అంటూ పూజా హెగ్డే

    హీరోయిన్‌ని అతిథిగా అంటూ పూజా హెగ్డే

    సాధారణంగా ఏదైనా సినిమా ఫంక్షన్‌కు స్టార్ హీరోలను గెస్టులుగా పిలుస్తారు. హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం అరుదుగా కనిపిస్తుంది. కానీ ఈ సినిమా సంగీత్ వేడుకకు నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్‌ చిన్నబాబు, నాగవంశీకి దక్కుతుంది. హారిక అండ్‌ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్‌. నిర్మాత చినబాబు నన్ను ఇంట్లో మనిషిలా చూసుకొంటారు అని పూజా హెగ్డే అన్నారు.

    Ritu Varma : బ్లూ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రచ్చ రేపుతున్న రీతువర్మ.. ఉల్లిపొర లాంటి బట్టల్లో!Ritu Varma : బ్లూ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రచ్చ రేపుతున్న రీతువర్మ.. ఉల్లిపొర లాంటి బట్టల్లో!

    థియేటర్లలోనే సినిమా చూడండి..

    థియేటర్లలోనే సినిమా చూడండి..

    గత రెండేళ్లుగా కరోనావైరస్ కారణంగా చాలా బాధపడ్డాం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు నార్మల్ అవుతున్నాయి. రిలాక్స్‌ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండి. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. వరుడు కావలెను మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా సక్సస్ సాధించి యూనిట్‌కు మంచి పేరుతోపాటు నిర్మాతలకు లాభాలు రావాలి అని అన్నారు.

    ఓటీటీలు బిగ్ ఆఫర్లు ఇచ్చాయి అంటూ నాగశౌర్య

    ఓటీటీలు బిగ్ ఆఫర్లు ఇచ్చాయి అంటూ నాగశౌర్య

    2018లో కథ విన్నాను. వెంటనే ఓకే చేశా. 2019లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా మహమ్మారిని చూశాం. చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా కంటెంట్ బాగా ఉందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు.

    సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. ఈ అక్టోబర్ 29న విడుదల కానున్న మా చిత్రానికి ఎలాంటి భయం లేకుండా అందరూ రావాలి. థియేటర్ల దగ్గర కొవిడ్‌ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం అని నాగశౌర్య అన్నారు.

    పూజా హెగ్డే రావడం హ్యాపీగా ఉందంటూ

    పూజా హెగ్డే రావడం హ్యాపీగా ఉందంటూ

    ప్రేమ, అనుబంధం నేపథ్యంగా పూర్తిగా కుటుంబ కథాంశంతోపాటు భావోద్వేగాలతో రూపొందిన చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతంలో మంచి డాన్స్‌ నంబర్స్‌ కుదిరాయి. నాగశౌర్య సపోర్ట్‌తో వర్క్‌ చాలా ఈజీ అయింది. హీరోయిన్‌ను అతిథిగా పిలవడం రేర్‌గా జరుగుతుంది. మా ఈవెంట్‌కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అని రీతూ వర్మ అన్నారు.

    పూజాహెగ్డేకు కృతజ్ఞతలు

    పూజాహెగ్డేకు కృతజ్ఞతలు

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద ష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌, యువతకు బాగా ఆకట్టుకునే చిత్రం వరుడు కావలెను. అతిథిగా హాజరైన పూజాహెగ్డేకు కృతజ్ఞతలు. సహకరిస్తున్న అభిమానులకు, మీడియాకు చాలా థ్యాంక్స్‌ అని నిర్మాత నాగవంశీ అన్నారు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు
    నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
    కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
    మాటలు: గణేష్ కుమార్ రావూరి
    సినిమాటోగ్రఫి: వంశీ పచ్చి పులుసు
    సంగీతం: విశాల్ చంద్రశేఖర్
    ఎడిటర్: నవీన్ నూలి
    ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
    పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
    సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
    బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్

    English summary
    Sithara Entertainments is producing Naga Shaurya and Ritu Varma-starrer Varudu Kavalenu. The film marks the directorial debut of Lakshmi Sowjanya and is all set for grand theatrical release on 29th October, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X