Pooja Hegde ఇండియన్ సినిమాలో పూజా హెగ్డేకు అరుదైన గుర్తింపు.. కేన్స్ ఫెస్టివల్‌లో బుట్ట బొమ్మ మెరుపులు!
ప్రతిష్టాత్మకంగా మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న 75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌పైనే భారతీయ సినీ తారలు, ప్రేక్షకుల దృష్టంతా ఉంది. ఇప్పటికే వేడుకల్లో పాల్గొనేందుకు దీపికా పదుకోన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ అహుజా, ప్రియాంక చోప్రా ఇప్పటికే బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనమంటూ పూజా హెగ్డేకు అధికారికంగా ఆహ్వానం పంపడం విశేషంగా మారింది. ఇలా ఆహ్వానం అందుకొన్న తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా పూజా హెగ్డే కావడం విశేషం.
ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా పూజా హెగ్డేకు ఇది అరుదైన గుర్తింపుగా మారింది. బాలీవుడ్‌కు చెందిన టాప్ అండ్ సీనియర్ స్టార్స్‌తో కలిసి ఈ అవార్డుల వేడుకలో సందడి చేయనున్నారు. అలాగే ఇండియన్ సినిమా గురించి జరిగే చర్చల్లో కూడా ఆమె పాల్గొనే అవకాశం ఉంది.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి ఆహ్వానం అందుకొన్న పూజా హెగ్డే మే 16వ తేదీన ఫ్రాన్స్‌కు బయలుదేరుతారు. మే 17, 18 తేదీల్లో ఫెస్టివల్‌లో పాలు పంచుకొంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా టాప్ యాక్టర్లందరికి ఏర్పాటు చేసిన విందులో కూడా పూజా హెగ్డే పాల్గొంటారు. ఈ విందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సూపర్ స్టార్స్ పాల్గొనడం గమనార్హం.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై కళ్లు చెదిరే ఫ్యాషన్స్ దుస్తుల్లో పూజా హెగ్డే సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించేందుకు పూజా ఆసక్తిగా ఉన్నారు. అంతేకాకుండా విదేశీ మీడియా కెమెరాల ముందు దృష్టిలో తన గ్లామర్ పంట పండించేందుకు ముస్తాబవుతున్నారు.
పూజా హెగ్డే సినిమా కెరీర్ విషయానికి వస్తే.. అలా వైకుంఠపురం, రాధేశ్యామ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించేందుకు సిద్దంగా ఉన్నారు. అలాగే సల్మాన్ ఖాన్‌తో కలిసి కబీ ఈద్ కబీ దీవాళీ, అలాగే రోహిత్ శెట్టి సర్కస్ చిత్రంలో రణ్‌వీర్ కపూర్‌తో కలిసి నటించనున్నారు.


Click it and Unblock the Notifications











