'ప్రభాస్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం.. ఆ హీరో నాకు దక్కాల్సిందే'
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లను ఏలింది కన్నడ కస్తూరి పూజా హెగ్డే. ఎంత స్పీడ్‌గా టాప్ పొజిషన్‌కు చేరుకుందో.. అంతే స్పీడ్‌గా ఇప్పుడు పాతాళానికి దిగిపోయింది. చివరికి ఐటెం సాంగ్స్ చేసుకునే స్థితికి పడిపోయింది పూజా హెగ్డే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె నర్తించిన మోనికా సాంగ్ మాస్‌ని ఊపేసింది. పూజా ఈ పాటలో బాగా అందంగానే ఉంది, పరువాలను సైతం బాగానే ప్రదర్శించింది. కానీ క్రెడిట్ మొత్తం సౌబిన్ షహర్‌కు వెళ్లిపోవడంతో పూజా బాగా డల్ అయ్యింది.
ఐరన్ లెగ్ ముద్ర
మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమ వైపు వచ్చిన పూజా హెగ్డేకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అంత ఈజీగా దొరకలేదు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. అవమానాలు, ఛీత్కారాలను మౌనంగా భరించి తన టాలెంట్‌తోనే సమాధానం చెప్పి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటించింది.

నత్తనడకన పూజా హెగ్డే కెరీర్
అయితే ఏం జరిగిందో ఏమో కానీ పూజా కెరీర్ ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అలాగే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో పూజాహెగ్డే అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కూలీలో స్పెషల్ సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించిన రెట్రో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కూలీలో చేసిన స్పెషల్ సాంగ్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చినా క్రెడిట్ మొత్తం సౌబిన్ షహర్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో కాంచన 4, హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలలో నటిస్తున్నారు పూజా హెగ్డే. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పూజా హెగ్డే.
బాహుబలి 3లో నటిస్తా
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో బాహుబలి 3 తీస్తే అందులో తనను హీరోయిన్‌గా తీసుకోమని అడుగుతానని పూజా హెగ్డే చెప్పింది. తనకు రాజమౌళి అంటే ఎంతో ఇష్టమని ఆయన కనుక ఈ ప్రతిష్టాత్మక సినిమా తీస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలిపింది. ప్రభాస్‌తో కలిసి మరోసారి నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పూజా హెగ్డే వెల్లడించింది. బాహుబలి 3 అవకాశం దక్కించుకోవం కోసం ఎంతకైనా తెగిస్తానని పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాధేశ్యామ్‌లో ప్రభాస్‌తో రొమాన్స్
కాగా.. పూజాహెగ్డే, ప్రభాస్‌లు గతంలో రాధేశ్యామ్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలో పూజ యాటిట్యూడ్, ఇగో వల్ల ప్రభాస్ బాగా ఇబ్బంది పడ్డాడని అలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇద్దరూ ఎడమోహం పెడమోహంగానే ఉండటంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. తాజాగా ప్రభాస్ సరసన మరోసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటూ పూజా హెగ్డే వ్యాఖ్యానించడం కలకలం రేపింది.


Click it and Unblock the Notifications











