‘శ్రీదేవి’ మీకూ బాగా నచ్చుతుంది: ‘గద్దలకొండ గణేష్’ పూజా వెరీ హ్యాపీ
గద్దలకొండ గణేష్ చిత్రంలో తాను పోషించిన పాత్ర తనకు ఎంతో నచ్చిందని ఆ సినిమా కథానాయిక పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన గద్దలకొండ గణేష్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.
పూజా వెరీ హ్యాపీ..
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ పాత్ర చాలా బలంగా ఉందని, ఆయన ఎంతో పరిణితితో నటించారని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇది ఇలావుంటే, తన పాత్రపై పూజా హెగ్డే చాలా హ్యాపీగా ఉంది.
అభిమానుల కోసం..
గద్దలకొండ గణేష్ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు పూజా హెగ్డే. ఒక నటిగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించాలని ఉంటుందని, గద్దలకొండ గణేష్ చిత్రంలో ఓ అమాయకురాలైన గ్రామీణ అమ్మాయి పాత్రలో నటించడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని వెల్లడించింది.
మీకూ నచ్చుతుంది..
ఈ సినిమాలో ‘శ్రీదేవి' పాత్ర చాలా కీలకమైందని, ఉండేది కొంత సమయమే అయినా మనందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుందని.. మీకూ నచ్చుతుందని పూజా తెలిపారు. ఈ రోజే గద్దలకొండ గణేష్ చిత్రం విడుదలైంది.. మిమ్మల్ని థియేటర్‌లో కలుస్తామని చెప్పుకొచ్చారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తమిళనటుడు అధర్వ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. పూజా హెగ్డేతోపాటు మృణాళిని అనే మరో నాయిక కూడా నటించింది.


Click it and Unblock the Notifications











