twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్‌తో బాధపడతున్నారా? ఆక్సిజన్ లెవెల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే.. కరోనా పేషెంట్లకు పూజా హెగ్డే చిట్కాలు!

    |

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనావైరస్ దాడి తీవ్రంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు కరోనావైరస్ పాజిటివ్‌తో బెంబేలు ఎత్తుతున్నారు. సకాలంలో వైద్యం అందక, ఈ వైరస్‌ను ఎలా డీల్ చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అలాగే అక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కరోనా బాధితులు అనవసరమైన భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇలాంటి విషయాలపై స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో కొన్ని చిట్కాలు చెప్పారు. ఆ విషయాల్లోకి వెళితే...

    డాక్టర్ల సూచనతో కరోనా నుంచి విముక్తి

    డాక్టర్ల సూచనతో కరోనా నుంచి విముక్తి


    కొద్ది రోజుల క్రితం గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే కరోనావైరస్ బారిన పడ్డారు. క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. సరైన పద్దతులను, డాక్టర్ల సూచనతో కరోనావైరస్‌పై పోరాటం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. ప్రస్తుతం తనకు తెలిసిన విషయాలను ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొంటున్నారు.

    ఆక్సిజన్ లెవెల్స్ చెకింగ్ ఎలా అంటే

    ఆక్సిజన్ లెవెల్స్ చెకింగ్ ఎలా అంటే

    నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలగానే హోం క్వారంటైన్ అయ్యాను. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ జాగ్రత్తగా పరిశీలించాలని వైద్యులు వెల్లడించారు. అయితే డాక్టర్లు చెప్పేంత వరకు ఆక్సిజన్ లెవెల్స్ ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. డాక్టర్లు చెప్పిన తర్వాతే నాకు ఆక్సోమీటర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది. కరోనా నుంచి సురక్షితంగా బయటపడాలంటే ప్రతీ విషయం చాలా ముఖ్యమైనదని భావించాలి అంటూ పూజా హెగ్డే వెల్లడించారు.

    చేతులు తడిగా లేకుండా...

    చేతులు తడిగా లేకుండా...

    పల్స్ ఆక్సోమీటర్ ఉయోగించడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చూపుడు వేలుకు ఉండే నెయిల్ పెయింట్‌ను తొలగించుకోవాలి. చేతులు తడిగా లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ లెవెల్స్ చూసుకొనే ముందు కనీసం కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అని పూజా హెగ్డే సూచించారు.

    చేతిని ఛాతిపైకి తీసుకొని...

    ఆక్సిజన్ లెవెల్ పరీక్షించుకొనే ముందు విశ్రాంతి తీసుకొని.. ఆ తర్వాత చూపుడు వేలుగా గానీ.. లేదా మిడిల్ ఫింగర్‌కు గానీ ఆక్సిమీటర్‌ను అమర్చుకోవాలి. ఆ తర్వాత చేతిని ఛాతిపై కి తీసుకువచ్చి ఆక్సీమీటర్‌ను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం వెయిట్ చేసి హయ్యెస్ట్ రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి అని పూజా హెగ్డే సూచించారు.

    Recommended Video

    SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
    పూజా హెగ్డే కెరీర్ ఇలా...

    పూజా హెగ్డే కెరీర్ ఇలా...


    ఇదిలా ఉండగా.. పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. బాలీవుడ్‌లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న Thalapathy 65 చిత్రంలోను, అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో కూడా నటించేందుకు ఒకే చెప్పారు. ఇంకా టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

    English summary
    Actress Pooja Hegde tips to Coronavirus Patients: When I was down with COVID-19 and home quarantined, I was told to monitor my O2 levels very closely. I didn’t know there was a right way to do it until my doctor told me. I hope this helps. No detail is too small in our efforts to fight this disease. Stay safe everyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X