For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pooja Hegde ప్రముఖ ఆలయంలో పూజా హెగ్డే .. ఆ కోరిక తీర్చుకొనేందుకు పూజలు?

  |

  అందాల భామ, బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొద్దికాలంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కెరీర్ గ్రాఫ్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లింది. హిట్టు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అగ్ర నటులు భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకెళ్తున్నది. అయితే రివ్వున కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలో 2022 సంవత్సరం కాస్త తడబాటుకు గురైంది. అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్‌కు ఎక్కేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు చేపట్టింది. అయితే ఇటీవల కాలంలో దోష నివారణ చర్యలు చేపట్టింది. దాంతో ఆలయాల సందర్శన చేస్తూ దేవుళ్ల ఆశీస్సులు పొందుతున్నది. పూజా హెగ్డే ఇటీవల సందర్శించిన ఆలయం వివరాల్లోకి వెళితే..

  గత ఐదేళ్లలో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో

  గత ఐదేళ్లలో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో


  గత ఐదేళ్లలో పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకెళ్లింది. దువ్వాడ జగన్నాథం మూవీతో సక్సెస్ యాత్ర ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, హౌస్‌ఫుల్ 2, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల విజయాలతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నది.

  పూజా హెగ్డే సక్సెస్ జోష్‌కు బ్రేక్

  పూజా హెగ్డే సక్సెస్ జోష్‌కు బ్రేక్


  అయితే టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న పూజా హెగ్డేకు 2022 సంవత్సరం బ్రేక్ వేసింది. రాధేశ్యామ్ సినిమాతో మంచి క్రేజ్‌తో కొంత్ సంవత్సరాన్ని ప్లాన్ చేసింది. ఆ తర్వాత వచ్ిన బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. నటిగా మెచ్యురిటీని ప్రదర్శించిందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపించాయి.

  పెద్దమ గుడికి పూజా హెగ్డే

  పెద్దమ గుడికి పూజా హెగ్డే

  ఇలాంటి పరిస్థితుల్లో పూజా హెగ్డే పెండింగ్‌లో ఉన్న దైవ పూజలు, చాలా కాలంగా మిగిలిన ఆలయ సందర్శనలకు కాస్త టైమ్ తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. తాజాగా పూజా హెగ్డే హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడిని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసి తన మొక్కులు తీర్చుకొన్నారు. వేదపండితు ఆశీర్వాదాన్ని తీసుకొన్నారు. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించారు.

  అభిమానుల తాకిడితో ..

  అభిమానుల తాకిడితో ..

  హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్లిన పూజా హెగ్డేకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన పూజా హెగ్డేకు ఆలయంలో మంచి రెస్పాన్స్ లభించింది. అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. బుట్ట బొమ్మ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి కనిపించింది. అయితే పవిత్ర ప్రదేశంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి పూజా తన టీమ్‌తో వెళ్లిపోయారు.

   SSMB28 కోసం రెడీగా బుట్టబొమ్మ

  SSMB28 కోసం రెడీగా బుట్టబొమ్మ


  ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నాగార్జున అక్కినేనితో కలిసి ఓ యాడ్‌లో నటించింది. త్వరలోనే ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్, కిసి కా జాన్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా SSMB28 కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది. అయితే త్వరలోనే మహేష్ బాబు సినిమా మొదలు కాబోతున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయానికి వెళ్లినట్టు సినీ వర్గాల సమాచారం. మళ్లీ సక్సెస్ బాట పట్టాలని ఆమ్మవారిని వేడుకొన్నట్టు తెలిసింది.

  English summary
  Top Actress and Butta Bomma Pooja Hegde is doing crazy projects with Salman Khan and Mahesh Babu. Before SSMB28, She visited Hyderabad Peddamma Temple recently.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X