ప్రియుడితో కలిసి అర్ధనగ్నంగా పూనమ్ బజ్వా... రొమాంటిక్ ఫోటోలతో బాయ్‌ఫ్రెండ్ గుట్టురట్టు

తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల భామ పూనమ్ బజ్వా కొద్ది రోజులుగా సినీ రంగానికి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మహా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్‌లో ఉండటం తెలిసిందే. అయితే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ పేరును, ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి షాకిచ్చారు. ఇంతకు పూనమ్ బజ్వా ప్రియుడు ఎవరంటే..

పూనమ్ బజ్వా అఫైర్‌పై వార్తలు

పూనమ్ బజ్వా అఫైర్‌పై వార్తలు


గత కొద్దికాలంగా పూనమ్ బజ్వా అఫైర్ కొనసాగిస్తుందనే వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి. అయితే పూనమ్ ఎవరితో డేటింగ్ చేస్తున్నదనే విషయంపై క్లారిటీ లేకపోయింది. తన డేటింగ్ వ్యవహారాన్ని అంత పకడ్బందీగా పూనమ్ దాచిపెట్టింది. తాజాగా తన ప్రియుడి పుట్టిన రోజున ఓ రొమాంటిక్ ఫోటోను బయటపెట్టింది.

నా ఆత్మబంధువుతో రొమాంటిక్ డేట్

నా ఆత్మబంధువుతో రొమాంటిక్ డేట్

నా ఆత్మ బంధువు, నా జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి సునీల్ రెడ్డి అంటూ ప్రియుడి పేరును బయటపెట్టింది. బర్త్ డే గ్రీటింగ్స్.. నా జీవిత మూలాలకు, నా ఊహల రెక్కలకు అతడే కారణం. అందమైన నా ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు. అందమైన మనసు ఉన్న వాడు. రొమాంటిక్ డేట్, జీవిత భాగస్వామి, నేను చేసే నేరాల్లో కూడా అతడు కూడా భాగస్వామి అంటూ పూనమ్ బజ్వా తన పోస్టులో భావోద్వేగంగా పోస్టు చేసింది.

సముద్రపు ఒడ్డున అర్ధనగ్నంగా

సముద్రపు ఒడ్డున అర్ధనగ్నంగా

ప్రియుడు సునీల్ రెడ్డితో కలిసి సముద్రపు ఒడ్డున అర్ధనగ్నంగా ఉన్న రొమాంటిక్ ఫోటోను అభిమానులతో పూనమ్ బజ్వా పంచుకొన్నారు. ప్రియుడితో కలిసి అనుభవిస్తున్న ఆనంద క్షణాలతో మైమరిపోయినట్టు కనిపించింది. అలా ప్రియుడి బర్త్ డేను పూనమ్ బజ్వా ఘనంగా జరుపుకొన్నట్టు స్పష్టమైంది.

బిగ్‌బాస్ తెలుగు 4లోకి అంటూ

బిగ్‌బాస్ తెలుగు 4లోకి అంటూ

ఇదిలా ఉండగా, టాలీవుడ్‌కు దూరమైన పూనమ్ బజ్వా పేరు ఇటీవల మీడియాలో భారీగానే వినిపించింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభానికి ముందు పూనమ్ బజ్వా రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే బిగ్‌బాస్‌లో మాత్రం కనిపించలేదు. దాంతో ఆ వార్తలన్నీ గాసిప్స్ అనేది స్పష్టమయ్యాయి.

నాగార్జునతో బాస్ అంటూ కెరీర్

నాగార్జునతో బాస్ అంటూ కెరీర్

పూనమ్ బజ్వా కెరీర్ విషయానికి వస్తే.. మొదటి సినిమా అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే సినిమాలో కనిపించింది. అనంతరం అక్కినేని నాగార్జునతో బాస్ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు. ఆ తర్వాత పరుగు సినిమా తర్వాత తమిళ, మలయాళ చిత్ర రంగానికి పరిమితమయ్యారు. ఇటీవల ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X