Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పెళ్ళై ఇద్దరు పిల్లలు అంటూ ప్రచారం.. చేసిన రచ్చ చాలంటూ అసలు నిజం చెప్పిన పూనమ్ కౌర్
హైదరాబాద్ లో పుట్టి హైదరాబాదులోనే పెరిగిన ఉత్తరాది భామ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను చేసిన సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉండే ఆమె తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. కొద్ది రోజుల క్రితం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పెట్టిన ఫోటో అనేక చర్చలకు దారి తీసింది ఆ పిల్లలు పిల్లలు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద ఆమె స్పందించింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న పూనమ్ కౌర్ ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో చదువుకుంది. అయితే తేజ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాయాజాలం అనే సినిమాలో ఆమె స్వాతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ఒక విచిత్రం అనే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలా వరుసగా సౌర్యం, వినాయకుడు, ఈనాడు, నాగవల్లి, గగనం, వీధి బ్రహ్మిగాడి కథ, ఆడుమగాడ్రాబుజ్జి, పొగ, సూపర్ స్టార్ కిడ్నాప్, ఎటాక్, నెక్స్ట్ ఏంటి, నాతి చరామి అనే సినిమాలలో ఆమె నటించింది. ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే అర్థంకాని ట్వీట్ చేసి వివాదాలు రేపడంలోనే ఎక్కువ ఫేమస్. అయితే కొద్ది రోజుల క్రితం ఇద్దరు పిల్లలు ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటోలకు ఆమె ఫోజులు ఇచ్చింది. ఇంకేముంది ఆ పిల్లలు పూనమ్ కౌర్ పిల్లలని, ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కూడా వినిపించాయి. ఆ కామెంట్స్ ఆధారంగా చేసుకుని కొన్ని వెబ్ సైట్స్ ఈ విషయం మీద కథనాలు కూడా ప్రచురించాయి. తాజాగా ఇదే విషయం ఆమె వరకు వెళ్లి నట్లు ఉంది దీంతో ఆమె ఈ విషయం మీద స్పందించింది.

ఇప్పటికే చేయాల్సినంత నష్టం చేశారు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది వాళ్లిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు అని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఇలా క్లారిటీ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు సోషల్ మీడియాకి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న అని అంటూ ఆమె కామెంట్ చేసింది. చివరిగా ఆమె నాతిచరామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. ఇక పూనం కౌర్ ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తుందో అర్థం కాకుండా వారి పేరు మెన్షన్ చేయకుండా కామెంట్స్ చేయడంలో దిట్ట. ఇప్పుడు ఈ విషయంలో కూడా అభిమానులు ఆమెనే తప్పుపడుతున్నారు. నువ్వు ఫోటో పెట్టి ఊరుకుంటే ఎవరని అనుకోవాలి అందుకే రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. నువ్వు క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంత హడావుడి ఉండేది కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.