కేన్స్ లేకపోతేనేం.. నా చిన్ని కేన్స్ మూమెంట్ ఇదే.. హొయలు పోతున్న ప్రగ్యా జైస్వాల్!
కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు దక్కలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం అనేక విధాలుగా ఈ భామ ప్రయత్నిస్తోంది. కంచె తర్వాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసినా ఈ భామకు ఒక్కటీ కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ భామకి తెలుగులో బాలయ్య అఖండ తప్ప అవకాశాలు లేవు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండే ఈ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇంటర్నెట్ లో ఒక ఫోటో షేర్ చేసి ఆసక్తికరంగా కామెంట్ చేసింది. ఇప్పుడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉండగా ప్రగ్యా జైస్వాల్ ఒక హాట్ ఫోటో షేర్ చేసి నా కేన్స్ మూమెంట్ లో నేనున్నానని రాసుకొచ్చింది. ఈ భామ చాలా లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్‌లో అఖండ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.

అందుకే ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది ప్రగ్యా.
ప్రగ్యా జైస్వాల్ తన రెండవ ఇల్లుగా చెబుతున్న హైదరాబాద్‌లో షూట్ మొదలు పెట్టడానికి ఉత్సాహంగా ఉంది. "హైదరాబాద్ తిరిగి రావడం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా హృదయానికి దగ్గరగా ఉన్న నగరాల్లో ఒకటి. ఇది దాదాపు నాకు రెండో ఇల్లు లాంటిది మరియు గత రెండు నెలలుగా నేను నగరాన్ని నిజంగా మిస్ అయ్యాను, హైదరాబాద్‌లో ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, కాబట్టి షూట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అని చెప్పుకొచ్చింది. చివరి సారి ఇక్కడ ఉన్నప్పుడు, ఏప్రిల్‌లో సూపర్ హాట్‌గా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











