Priyanka Chopra ఆ ప్రాక్టీస్ లేదా? పిల్లలు ఎందుకు లేరు? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ప్రియాంక చోప్రా జవాబు

హిందీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంటుందా? అనే ప్రశ్నలకు ధీటైన జవాబు ఇవ్వడమే కాకుండా బాలీవుడ్‌లో పాగవేసిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో తన సత్తాను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవలే ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం రిలీజై మంచి రెస్సాన్స్ కూడగట్టుకొన్నది. అయితే తాజాగా ఆమె వైవాహిక జీవితం సమస్యల్లో పడింది? అందుకే సంతానంపై దృష్టి పెట్టలేదనే రూమర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత, దాంప్యత జీవితంపై వస్తున్న గాసిప్స్ గురించి ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితంలోకి ఓ సారి తొంగి చూస్తే..

అఫైర్లు, డేటింగ్ వార్తలు స్వైరవిహారం

అఫైర్లు, డేటింగ్ వార్తలు స్వైరవిహారం

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలినాళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొన్నది. వివాదాలు, అఫైర్లు, డేటింగ్ వార్తలు ముంబై మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే తన ప్రతిష్టకు ప్రశ్నర్థాకంగా మారిన విషయాలను సమయస్పూర్తితో ఎదుర్కొన్నది. ఒక్కో అడుగు వేస్తూ బాలీవుడ్‌ అగ్రస్థానానికి చేరుకొన్నది. ఇక అంతటితో ఆగకుండా గ్లోబల్ ఐకాన్‌గా మారింది.

బాలీవుడ్ హీరోలతో అఫైర్ వార్తలు

బాలీవుడ్ హీరోలతో అఫైర్ వార్తలు

బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉండగానే.. పలువురు హీరోలతో అఫైర్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై పెద్దగా స్పందించకుండా తనదైన శైలిలో మౌనం వహించింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా అమెరికాకు చెందిన నిక్ జోనస్‌తో లవ్ పడిన ప్రియాంక.. 2018లో అతడిని పెళ్లి చేసుకొన్నది. అప్పటి నుంచి అమెరికాలోనే ఉంటూ నిక్‌తో దాంపత్య జీవితాన్ని గడుపుతున్నది.

ఇన్స్‌టాగ్రామ్‌లో భర్త ఇంటి పేరు తొలగింపు

ఇన్స్‌టాగ్రామ్‌లో భర్త ఇంటి పేరు తొలగింపు

ఇక ఈ మధ్య తన ఇన్స్‌టాగ్రామ్‌ నుంచి జోనస్ అనే భర్త ఇంటి పేరును తొలగించడంతో ప్రియాంక, నిక్ జోనస్ విడిపోతున్నారు. నిక్, ప్రియాంక దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయి అనే వార్తలు ప్రచారం జోరుగా సాగింది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. జోనస్ పేరు తొలగించడం వెనుక ఎలాంటి వివాదాలు లేవు అంటూ నిక్, ప్రియాంక క్లారిటీ ఇచ్చారు.

పిల్లలు ఎందుకు కనడం లేదు?

పిల్లలు ఎందుకు కనడం లేదు?

అయితే ప్రియాంక చోప్రాను మరో ప్రశ్న నెటిజన్లు, మీడియాను వెంటాడుతున్నది. వివాహం జరిగి నాలుగేళ్లు అయినా మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు. పిల్లల్ని ఎందుకు కనడం లేదు? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రియాంక వాటికి సానుకూలంగా స్పందిస్తూ ఆ ప్రశ్నలను దాటేస్తు వచ్చింది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా ఓ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ సంతానం విషయంలో క్లారిటీ ఇచ్చింది.

సంతానం ఎప్పుడు జరగాలో.. అప్పుడే

సంతానం ఎప్పుడు జరగాలో.. అప్పుడే

నిక్ జోనస్‌తో నాలుగేళ్ల దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతున్నది. పిల్లల్ని కనడం అనే జీవితంలో గొప్ప మధురానుభూతి. భవిష్యత్‌లో ఆ అంశం మా జీవితంలో గొప్ప పాత్ర పోషించబోతున్నది. భగవంతుడి దయ ఉంటే.. పిలల్ని కనడమనేది ఎప్పుడు జరగాలో.. అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతం కెరీర్‌పరంగా ఇద్దరం బిజీగా ఉన్నాం అని ప్రియాంక చోప్రా సమాధానం ఇచ్చారు.

సంతానం విషయంలో క్లారిటీ

సంతానం విషయంలో క్లారిటీ

సంతానం విషయంలో నిక్ జోనస్‌కు, నాకు స్పష్టమైన అవగాహన ఉంది. లైఫ్‌లో మాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు పిల్లల్ని కనడానికి ప్రాక్టీస్ చేయడం లేదు. మాకు అలాంటి ప్లాన్ కూడా మా క్యాలెంటర్‌లో లేదు . ఒకసారి పిల్లలు మా జీవితంలోకి వస్తే జీవితం నిదానంగా సాగేలా ప్లాన్ చేసుకొంటున్నాం అంటూ ప్రియాంక చోప్రా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ప్రియాంక చోప్రా మూవీ కెరీర్ ఇలా

ప్రియాంక చోప్రా మూవీ కెరీర్ ఇలా

బాలీవుడ్‌కు దూరమైన ప్రియాంక చోప్రా తాజాగా హాలీవుడ్‌లో మోత మోగిస్తున్నది. ఇటీవల ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రంలో సతి అనే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇంకా జిమ్ స్ట్రాస్‌తో కలిసి టెక్ట్స్ ఫర్ యూ, జో, అంథోనితో కలిసి సిటాడెల్, లాగే ఆలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి జీ లే జార చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X