Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కారు గిఫ్టుగా ప్రియాంక చోప్రాను బుట్టలో వేసుకొన్న భర్త.. ఆ వాహనం ధర ఎంతో తెలుసా?
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జీవితం హుషారుగా ఫుల్ జోష్‌తో పరవళ్లు తొక్కుతున్నది. సర్రోగసి ద్వారా జన్మనిచ్చిన బిడ్డ 100 రోజుల తర్వాత ఇంటికి చేరడంతో ఆనందంలో మునిగి తేలుతున్న ప్రియాంకకు భర్త నిక్ జోనస్ ఆశ్చర్యపరిచే విధంగా బహుమతితో శ్రీమతిని ప్రసన్నం చేసుకొన్నాడు. తనకు లభించిన మోటార్ వెహికిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది. ఆ వెహికిల్ ఖరీదు ఎంత అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో శోధించగా. దాని ధర ఎంత అని తేలిందంటే?

100 రోజుల తర్వాత కూతురు ఇంటికి
ప్రియాంక చోప్రా లైఫ్‌లోకి ప్రవేశించిన కూతురు నెలలు నిండకుండా పుట్టిన నేపథ్యంలో దాదాపు 100 రోజులకుపైగా నియో నటల్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. అయితే వైద్యుల సూచనతో మదర్స్ డే సందర్భంగా కూతురును తన ఇంటికి తీసుకొచ్చి భారీగా సెలబ్రేషన్ చేసుకొన్నారు.

ప్రియాంకకు నిక్ జోనస్ గిఫ్ట్
కూతురు రాకతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న ప్రియాంక చోప్రాకు తన భర్త నిక్ జోనస్ మంచి గిఫ్ట్‌ను అందించారు. ఆల్ టెర్రెయిన్ వెహికల్ (ఏటీవీ) అనే వాహనాన్ని బహుమతిగా అందించారు. భర్త గిఫ్టుగా అందించిన కారులో కూర్చొని ఉన్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయింది. కారుపై మిసెస్ జోనస్ అని రాసి ఉండటం గమనార్హం.

ఇన్స్‌టాగ్రామ్‌లో పిక్ వైరల్
తనకు కారును గిఫ్టుగా ఇచ్చిన భర్త నిక్ జోనస్‌పై ప్రేమను కురిపించారు. నా మంచి భర్త అంటూ హ్యాష్ ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేయగా భారీగా లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ రైడ్ బాగుంది. థ్యాంక్స్ నిక్ జోనస్. కూల్‌గా ఉండే భర్త నాకు ఎప్పుడూ హెల్పింగ్‌గా ఉంటాడు అని ప్రియాంక చోప్రా పోస్టు పెట్టింది.
పోలారిస్ జనరల్ ఏటీవీ ధర ఎంతంటే?
పర్వత ప్రాంతాలు, గడ్డి మైదానాల్లో విహరించేందుకు ఆల్ టెర్రెయిన్ వెహికల్‌ను ఉపయోగిస్తారు. ఈ వెహికిల్ పోలారిస్ జనరల్ 1000 మోడల్‌కు చెందినది. స్పోర్ట్స్ డిజైన్‌తో ఉండే ఈ కారు భారతీయ కరెన్సీలో ధర 14.16 లక్షల రూపాయాలు. ధర పెద్దగా కాకపోయిన భర్త ఇచ్చిన గిఫ్టును చూసి మురిసిపోయింది.

ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ఇలా..
ప్రియాంక చోప్రా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. సిటాడెల్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నది. ఈ చిత్రంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి నటిస్తున్నది. అవెంజర్ ఫేమ్ రుస్పో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే ఇట్స్ కమింగ్ బ్యాక్ టు మీ అనే చిత్రంలో కూడా నటిస్తున్నది. హిందీలో ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో జీ లే జరా చిత్రంలో కత్రినా కైఫ్, ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నది.