Just In
Don't Miss!
- News
కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియాంక బర్త్ డే కేకుకు అదిరిపోయే రేటు.. భర్త ఎంత ఖర్చు చేశాడంటే..
బాలీవుడ్ అందాల సుందరి ప్రియాంక చోప్రా తన 37వ జన్మదినం గుర్తుండిపోయేలా జరుపుకొన్నది. పెళ్లి తర్వాత మదిలో నిలిచిపోయే విధంగా భర్త నిక్ జోనస్ జూలై 18న తన బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. తన భార్య పుట్టిన రోజు జూలై 18 కావడంతో ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ప్రియాంక చోప్రా ఎర్రటి మినీ డ్రస్సులో అదరగొట్టారు. ప్రియాంక అంటే ఎంతో ప్రేమో అనే విషయాన్ని నిక్ ఓ భారీ కేక్ రూపంలో చాటుకొన్నారు.
ప్రియాంక చోప్రా కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈ కేకు కోసం నిక్ రూ.3.45 లక్షల ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రియాంకకు ఇష్టమైన ఎరుపు, బంగారం రంగులో ఉండే కేక్‌ను తయారు చేయమని చెప్పినట్టు కేక్ డిజైనర్ వెల్లడించారు. నిక్ కోరిక మేరకు ఐదు లేయర్లు ఉన్న ఈ కేక్‌ను దాదాపు 24 గంటలపాటు కష్టపడి ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలిసింది. చాకోలేట్, వెనీలా కలిపి చేసిన ఈ కేకులో 24 కేరట్ల బంగారం పూత కూడా ఉన్నట్టు చెప్పారు.

జూలై 17వ తేదీ రాత్రి జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్‌లో అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరైనట్టు సమాచారం. మియామిలోని ఒక ఓడలో ఏర్పాటు చేసిన పార్టీలో ప్రియాంక చోప్రా హంగామా చేశారట. ప్రియాంక చోప్రా బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా పోస్టు చేసిన ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.