For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahsa Amini: ఆ వివాదంలోకి ప్రియాంక చోప్రా.. వాళ్లకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు

  |

  సుదీర్ఘ కాలం పాటు ఇండియన్ సినిమాలో హవాను చూపిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది ప్రియాంక చోప్రా. అంతేకాదు, ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ అనిపించుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితురాలు అయిన ఈ బ్యూటీ.. సినిమాలు పెద్దగా చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రతి అంశంపై స్పందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మాషా అమినీ మరణం, ఆ తర్వాత కొనసాగుతోన్న పరిస్థితులపై ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

  ఇరాన్‌లో మాషా అమినీ మరణం

  ఇరాన్‌లో మాషా అమినీ మరణం

  ఇరాన్ దేశంలో హిజాబ్ ధరించలేదని మాషా అమినీ(22) అనే యువతిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 16న ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి, ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  ప్రభుత్వం చర్యలు.. తగ్గట్లేదుగా

  ప్రభుత్వం చర్యలు.. తగ్గట్లేదుగా

  మాషా అమినీ మరణంతో ఇరాన్ దేశం అట్టుడుకుతోంది. అక్కడి మహిళలు స్వచ్చందంగా బయటకు వచ్చి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్​లను తగలబెడ్తూ రోజూ నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాఠీ చార్జ్‌లతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటోంది. అయినా అక్కడి మహిళలు వెనక్కి తగ్గట్లేదు.

  ప్రియాంక చోప్రా ఇన్‌స్టా పోస్టు

  ప్రియాంక చోప్రా ఇన్‌స్టా పోస్టు

  మాషా అమినీ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ వివాదంపై స్పందించింది. ఇందులో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన నోట్‌ను రాసి.. అందులో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  అగ్నిపర్వతంలా పేలాయంటూ

  అగ్నిపర్వతంలా పేలాయంటూ

  ప్రియాంక చోప్రా తన నోట్‌లో 'మాషా అమినీ మరణం తర్వాత ఇరాన్‌లోని మహిళలు బహిరంగంగా జుట్టు కత్తిరించుకోవడంతో పాటు పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ తమ గొంతులను వినిపిస్తున్నారు. యుగయుగాలుగా మౌనంగా ఉన్న స్వరాలు అగ్నిపర్వతంలా పేలుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగకూడదు' అని రాసుకొచ్చింది.

  మీ ధైర్యానికి విస్మయం చెందా

  మీ ధైర్యానికి విస్మయం చెందా


  అదే నోట్‌లో ప్రియాంక 'మీ ధైర్యం, తెగింపు చూసి విస్మయం చెందాను. పితృస్వామ్యాన్ని సవాలు చేయడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం అంత సులభమైన విషయం కాదు. కానీ, మీరు దేన్నీ లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న ధైర్యవంతులు. మీ ఉద్యమం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని అనుకుంటున్నాను' అని నిరసనకారులను ప్రశంసించింది.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  నేనూ మీతో నిలబడతానంటూ

  నేనూ మీతో నిలబడతానంటూ

  ప్రియాంక చోప్రా తన నోట్‌లో 'ఇరాన్‌లో పోరాటం చేస్తున్న మహిళల బాధలను అర్థం చేసుకుని మనం కూడా స్వరాన్ని వినిపించాలి. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయగలిగేలా చైతన్య పరచాలి. ఈ ఉద్యమానికి మీ గొంతును కూడా అందించండి. నేను మీతో నిలబడతాను. జిన్.. జియాన్.. ఆజాదీ (మహిళలు.. జీవితం.. స్వాతంత్ర్యం)' అంటూ పోరాడుతోన్న వాళ్లకు మద్దతు తెలిపింది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Pens Emotional Note On Mahsa Amini Controversy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X