రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండానే హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్ పేరు గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా పరిచయం.. టాలీవుడ్‌లో ఎంట్రీ

అలా పరిచయం.. టాలీవుడ్‌లో ఎంట్రీ

చిన్న వయసులోనే 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇక్కడే కాదు... అక్కడ కూడా సందడి

ఇక్కడే కాదు... అక్కడ కూడా సందడి

హిందీ చిత్రంతో నటిగా పరిచయమై.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే 'విలన్' అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ హవా చూపిస్తోంది.

ఫుల్ ఫామ్‌లో రాశీ.. అదొక్కటే మైనస్

ఫుల్ ఫామ్‌లో రాశీ.. అదొక్కటే మైనస్

రాశీ ఖన్నా ఆరంభంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. నటిగానే కాదు.. సింగర్‌గానూ సత్తా చాటింది. మొదట్లో గ్లామర్ పాత్రలు చేసినా.. ఈ మధ్య స్కోప్ ఉన్నవే చేస్తోంది. ఇలా 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుందామె. ఆ తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' నిరాశ పర్చింది.

అన్నింట్లోనూ ఉంటూ హవా చూపిస్తూ

అన్నింట్లోనూ ఉంటూ హవా చూపిస్తూ

ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో హీరోయిన్‌గా చేస్తోంది. తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌ చేస్తోంది.

మరే హీరోయిన్‌ చేయని విధంగా సత్తా

మరే హీరోయిన్‌ చేయని విధంగా సత్తా

సుదీర్ఘమైన కెరీర్‌లో ఇప్పుడు రాశీ ఖన్నా గోల్డెన్ పిరియడ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో నాలుగు చిత్రాలు, మలయాళంలో ఒక మూవీ చేస్తోంది. అదే సమయంలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. మొత్తంగా కొన్ని రోజులు హైదరాబాద్‌లో, మరికొన్ని రోజులు చెన్నైలో, ముంబైలో ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీ దెబ్బకు అంతా షాక్ అవుతున్నారు.

అక్కడ మాత్రం రాశీ ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం రాశీ ఎప్పుడూ బిజీగా

చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

Recommended Video

Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
పర్సనల్ విషయాలపై క్లారిటీ ఇచ్చేసి

పర్సనల్ విషయాలపై క్లారిటీ ఇచ్చేసి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాశీ ఖన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ 'మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి' అని ప్రశ్నించాడు. దీనికి రాశీ 'అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు' అని బదులిచ్చింది. మరో నెటిజన్ 'సింగిల్‌గా ఎలా ఉంటున్నావు' అని అడగ్గా.. 'ఏదో అలా గడిపేస్తున్నా' అన్నట్లుగా సమాధానం చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X