హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. మెస్మరైజ్ చేసే యాక్టింగ్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు.. చాలా భాషల్లో వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. దీంతో ఈ అమ్మడు తీరక లేని షెడ్యూళ్లలో పాల్గొంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. టాలీవుడ్‌లో ఇలా
చిన్న వయసులోనే రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది.

అక్కడా ఇక్కడా రచ్చ చేస్తోంది
రాశీ ఖన్నా తెలుగులో గ్రాండ్ ఎంట్రీని అందుకుంది. దీంతో ఇక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిలైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే 'విలన్' అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది.

వరుస హిట్లు.. ఆ సిరీస్‌తో పేరు
కెరీర్ ఆరంభంలోనే రాశీ ఖన్నా తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అందుకే వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే తెలుగులో 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుంది. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్' నిరాశ పర్చింది. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'రుద్ర' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో సైకో పాత్రను చేసి యమ హైలైట్ అయింది.

ఎన్నో సినిమాలతో ఫుల్ బిజీగా
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా మరో హీరోయిన్ చేయని విధంగా.. తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఆఫర్లను అందుకుంది.

అందులో మాత్రం యాక్టివ్‌గానే
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో షేక్ చేయడంతో పాటు తన ఫాలోవర్ల సంఖ్యను కూడా బాగా పెంచుకుంటోంది.

హాట్ సెల్ఫీ షేర్ చేసిన భామ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. అంతేకాదు, అద్దం ముందు నిల్చుని తీసుకున్న పిక్ కావడంతో ఆమె తొడ అందాలు కూడా చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











