ఆ ఘటనతో మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయా.. : రాశీ ఖన్నా
తెలుగు సినీప్రియులకు రాశీ ఖన్నా (Raashii Khanna)పేరు కొత్తది కాదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను చేసుకుంది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుసగా విజయాలు సాధించి, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది. హిందీ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రాశీ, ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన "యోధ" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్న రాశీ, పాన్ ఇండియా లెవెల్‌లో తన కెరీర్‌ను మరో దశకు తీసుకెళ్తోంది.
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన "తెలుసు కదా" అనే సినిమా హీరోయిన్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించారు. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్ది మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అలా ప్రమోషన్స్ లో భాగంగా.. హీరోయిన్ రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని ప్రేమ, బ్రేకప్, మానసిక సమస్యలు, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

రాశీ ఖన్నా మాట్లాడుతూ "నేను నా జీవితంలో రెండు సార్లు కాదు, మూడు సార్లు ప్రేమలో పడ్డాను. ఒకసారి సినిమా రంగంలోకి రాకముందు, మరోసారి తర్వాత. కానీ ఆ సంబంధాలు కొనసాగలేదు. ప్రతి బ్రేకప్ నాకు ఒక పెద్ద పాఠం నేర్పింది. మొదటి ప్రేమ విఫలమైనప్పుడు నేను పూర్తిగా కుంగిపోయా. చాలా రోజులు మానసికంగా తట్టుకోలేకపోయా. ఆ సమయంలో నాకు కుటుంబం, స్నేహితులే అండగా నిలిచారు" అని చెప్పింది.
ఆ తరువాత తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న నిజాన్ని కూడా బయటపెట్టింది రాశీ. "నేను సినిమాల్లోకి రాకముందు నుంచే జిమ్‌కి వెళ్తున్నా. కానీ ఎంత వర్కౌట్ చేసినా వెయిట్ తగ్గలేదు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్ ఉన్నట్టు తెలిసింది. ఆ సమయంలో మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టాలు పడ్డాను. వెయిట్ తగ్గకపోవడం, బాడీపై మార్పులు రావడం నన్ను బాగా ప్రభావితం చేశాయి," అని ఆమె చెప్పింది.
అలాగే యంగ్ ఏజ్‌లో లవ్ బ్రేకప్ వల్ల తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పింది రాశీ. "ఆ సమయంలో నేను కంటిన్యూగా వెయిట్ తగ్గుతూ పోయా. జిమ్ ట్రైనర్స్ కూడా షాక్ అయ్యారు. తర్వాత నా ట్రైనర్స్, ఫ్రెండ్స్ అండగా ఉండటంతో క్రమంగా ప్రశాంతతను తిరిగి పొందాను. తర్వాత మరోసారి ప్రేమలో పడ్డా కానీ, ఆ రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు," అని చెప్పింది.
ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని చెప్పింది రాశీ. "ఇప్పుడున్న స్థితి నాకు చాలా ఇష్టం. మానసిక ప్రశాంతతే నిజమైన అందం. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం బలంగా ఉంటుంది. అందుకే నేను ప్రతిరోజు యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేస్తా. జిమ్‌కి వెళ్లడం నాకు మానసిక రిలీఫ్ ఇస్తుంది," అని చెప్పింది. తన గతం గురించి ఎటువంటి పశ్చాత్తాపం లేదని రాశీ ఖన్నా చివరిగా అన్నారు. "బ్రేకప్‌లు నా మనసును ముక్కలు చేశాయి కానీ, అదే నన్ను బలంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు నేను మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను," అని ఆమె స్పష్టంగా తెలిపింది.


Click it and Unblock the Notifications











