నయనతారను అవమానిస్తూ మాట్లాడిన సీనియర్ యాక్టర్.. తమిళ స్టార్ల రివర్స్ ఎటాక్!

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారపై అమర్యాదకరంగా, నీచమైన కామెంట్స్ చేసిన తమిళ సీనియర్ యాక్టర్ రాధారవి మీద నెటిజన్లతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, విఘ్నేష్ శివన్, చిన్మయి శ్రీపాద తదితరులు ఫైర్ అయ్యారు. అతడి తీరును తప్పుబడుతూ రివర్స్ ఎటాక్ ప్రారంభించారు.

నయనతార హీరోయిన్‌గా నటించిన 'కొళయుథిర్ కాలం' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో పాల్గొన్న రాధా రవి ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా రాధా రవి పలువురు మహిళలపై వివాదాస్పద కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే..

ఎవరు పడితే వారు దేవతా పాత్రలు వేస్తున్నారు

ఎవరు పడితే వారు దేవతా పాత్రలు వేస్తున్నారు

‘‘నయనతార దెయ్యంగా నటించారు... సీతా దేవి పాత్రలో నటించారు. గతంలో దేవతా పాత్రలు అంటే కెఆర్. విజయ్ బాగా ఫేమస్. ఆమెను మాత్రమే తీసుకునేవారు. ఈ రోజుల్లో ఎవరు పడితే వారితో దేవతా పాత్రలు వేయిస్తున్నారు. ప్రజల్లో క్రేజ్ ఉంటే చాలు వారితో దేవాతా మూర్తుల వేషాలు వేయిస్తున్నారు. నయనతార లాంటి వారిని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి''... అంటూ రాధారవి వెటకారపు వ్యాఖ్యలు చేశారు.

వారితో నయనతారను పోల్చడమేంటి? బాధగా ఉంది...

వారితో నయనతారను పోల్చడమేంటి? బాధగా ఉంది...

నయనతారను అంతా లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. ఆమె మంచి నటి.. నేను కాదనడం లేదు, అందుకే ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నా తట్టుకుని నిలబడ్డారు. తమిళనాడు ప్రజలు వివాదాలను నాలుగు రోజుల కంటే ఎక్కువగా గుర్తుంచుకోరు. కానీ నయనతారను సూపర్ స్టార్ అంటూ... ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లతో పోల్చడం బాధేస్తుందని రాధారవి వ్యాఖ్యానించారు.

భగ్గుమన్న వరలక్ష్మి శరత్ కుమార్

భగ్గుమన్న వరలక్ష్మి శరత్ కుమార్

రాధారవి వ్యాఖ్యలపై వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళలను అవమాన పరుస్తూ జోక్స్ వేయడం, అమర్యాదగా మాట్లాడటం మన ఇండస్ట్రీలో సర్వసాధారణం అయింది. ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు మన ముందు జనరేషన్ మహిళలకు థాంక్స్. వాళ్లు ఎదురు తిరగకుండా ఫర్వాలేదు అనుకుని భరిస్తూ రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇదీ మన రాష్టం.'' అంటూ మండి పడ్డారు.

నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ అసంతృప్తి

నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ అసంతృప్తి

నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ కూడా రాధారవి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అతడు ఒక పాపులర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరూ ఏమీ చేయరని తెలుసు. ఇలాంటి వ్యక్తులు పబ్లిసిటీ కోసం... బుర్రలేని వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన అలా నీచంగా మాట్లాడుతుంటే ఆడియన్స్ చప్పట్లు కొడుతూ నవ్వడం బాధేసింది. సినిమా పూర్తి కాకముందే ఇలాంటి ఈవెంట్ పెడతారని ఎవరూ అనుకోరు. సినిమా ప్రమోషన్ కోసం ఏం మాట్లాడాలో తెలియని ఇలాంటి వ్యక్తులను తీసుకురావడం కంటే ఈవెంట్ నిర్వహించకుండా మిన్నకుండిపోవడం మంచింది'' అని వ్యాఖ్యానించారు.

చిన్మయి శ్రీపాద...

చిన్మయి శ్రీపాద...

రాధారవి తీరుపై చిన్మయి శ్రీపాద కూడా మండి పడ్డారు. ఇలాంటి వ్యక్తులు తప్పుడు పనులు చేసినా ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరని తెలిపారు. గతంలో మీటూ ఉద్యమం నేపథ్యంలో రాధా రవిపై చిన్మయి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందు వల్లే కక్షకట్టి ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి బ్యాన్ చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

కొళయుథిర్ కాలం

కొళయుథిర్ కాలం

‘కొళయుథిర్ కాలం' చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార చెవిటి, మూగ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో భూమిక కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X