Just In
- 1 hr ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 2 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 3 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 4 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
ఢిల్లీలో ఉద్రిక్తతలు: భారత్‌లోని రాయబార కార్యాలయాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బికినీ అందాలతో మతి పోగొడుతున్న రకుల్.. హాట్ హాట్‌గా కామెంట్ చేసిన సినీ సెలెబ్రిటీ.!
తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, ఆ సమయంలోనే టాలీవుడ్‌లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గానూ నిలిచింది. గత ఏడాది ఒకే ఒక్క సినిమాతో పలకరించిన ఈ అమ్మడు.. తాజాగా షేర్ చేసిన బికినీ పిక్ సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది.

ఒక దానితోనే సరిపెట్టేసింది
గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. అది కూడా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు 2'లో. ఈ సినిమాలో రకుల్ ఎంతో బోల్డ్ క్యారెక్టర్‌ను చేసింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఇందులో ఆమె.. యాంకర్ ఝాన్సీని లిప్ కిస్ చేయడం చర్చనీయాంశం అయింది.

ఇక్కడి కంటే అక్కడే ఎక్కువ
రకుల్ ప్రీత్ సింగ్ 2019 తెలుగులో ఒక్క సినిమాలోనే నటించినప్పటికీ.. హిందీ, తమిళంలో మాత్రం పలు చిత్రాలను చేసింది. వీటిలో చాలా వరకు హిట్లుగా నిలిచాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేసింది. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలు చేయకున్నా.. హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి చేస్తోంది. ఈ రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

లోక నాయకుడి సినిమాలో ఛాన్స్
దక్షిణ భారతదేశంలోనే బడా హిట్ చిత్రంగా నిలిచి అన్ని భాషల్లోకి డబ్ అయిన చిత్రాల్లో ‘భారతీయుడు' ఒకటి. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న దేశ పరిస్థితులను ప్రశ్నించింది. దీంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఇండియన్ 2'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోనూ రకుల్ నటిస్తోంది.

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ
రకుల్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.
బికినీ అందాలతో మతి పోగొడుతున్న రకుల్
తాజాగా రకుల్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె నీలి రంగు బికినీ వేసుకుని ఉంది. ఈ బికినీ ఫొటోతో కుర్రకారు మనసు దోచేస్తోంది. దీంతో ఈ పిక్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అంతేకాదు, ఒక్కరోజులోనే ఈ ఫోటోకు పదమూడు లక్షల లైక్స్ కూడా రావడం విశేషం.

హాట్ హాట్ కామెంట్ చేసిన సినీ సెలెబ్రిటీ.!
రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ బికినీ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ ఫొటోను చాలా మంది లైక్స్ చేయగా.. కొందరు తమదైన కామెంట్లు చేస్తున్నారు. వారిలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. రకుల్ ఫొటోపై స్పందిస్తూ ‘హాట్ హాట్ హాట్' అంటూ ఆమె కామెంట్ చేశారు. వాస్తవానికి వీళ్లిద్దరి మధ్య ఎంతో కాలంగా స్నేహం ఉన్న విషయం తెలిసిందే.