Ramya Krishna : రమ్యకృష్ణ ఇలా మారిందేంటీ ?
Ramya Krishna new look: సౌత్ సినిమా ప్రేక్షకులకు రమ్యకృష్ణ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే పాత్ర "శివగామి". బాహుబలి సిరీస్‌లో ఆమె పోషించిన ఆ శక్తివంతమైన పాత్ర ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. శివగామి డామినేషన్‌తో రమ్యకృష్ణ రెండో ఇన్నింగ్స్‌కి మంచి పునాది పడింది. ఇప్పుడు అదే రమ్యకృష్ణ, మరోసారి విభిన్నమైన లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతోంది. తాజా లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో రమ్యకృష్ణ కొత్త లుక్ వైరల్ అవుతోంది. చేతిలో సిగరెట్, ముఖంపై బొట్లు, జీన్స్ ప్యాంట్‌లో మాసీ లుక్ - టామ్ బాయ్ స్టైల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తుంది. గతంలో ఎప్పడూ రమ్యకృష్ణని ఇంతకుముందెప్పుడూ చూడలేదు. ఈ లుక్‌ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఇదే రమ్యకృష్ణ లుక్" అంటూ వెల్లడించారు. అయితే, రమ్యకృష్ణ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కాదని, మరో కీలకమైన హ్యూమన్ రోల్‌లో నటిస్తున్నారని వర్మ క్లారిటీ ఇచ్చారు.

'పోలీస్ స్టేషన్ మే భూత్' రామ్ గోపాల్ వర్మ తీస్తున్న తాజా హారర్ థ్రిల్లర్. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. జెనీలియా దేశ్‌ముఖ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. సినిమా కథ ఒక డాన్ చనిపోయి దెయ్యంగా మారి పోలీసులకి ఎలా ఇబ్బందులు కలిగిస్తాడో అనే అంశం చుట్టూ తిరుగుతుంది. సాధారణ హారర్ మూవీలా కాకుండా, పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సైకాలజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "ఇది భయపెట్టే కథ మాత్రమే కాదు, సిస్టమ్‌కి సంబంధించిన సింబాలిక్ మెసేజ్ కూడా ఉంటుంది" అన్నారు. అటు రమ్య లుక్స్, ఆర్జీవీ కామెంట్స్ మూవీపై హైప్స్ క్రియేట్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ స్టైల్ అంటే ఎప్పుడూ విభిన్నం. ఈసారి కూడా అదే చేశారు. ఇటీవల "నన్ను అరెస్ట్ చేసి లాకప్‌లో పెట్టారు" అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో వర్మ తన టీమ్‌తో కలిసి లాకప్‌లో ఉన్నట్లు కనిపించారు.
ఇది సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పార్ట్ అని తర్వాత వెల్లడైంది. ఇలా మొదటి నుంచే ఆసక్తి రేకెత్తించే స్టైల్లో సినిమా ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో రమ్యకృష్ణ ఫోటోలను పోస్టు చేస్తూ.. ఆ పాత్ర ఏంటో? ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ? గెస్ చేయండంటూ ట్విట్ చేస్తున్నారు ఆర్జీవి.
అయితే.. శివగామి లాంటి డివైన్ రోల్ తర్వాత ఇలాంటి రఫ్ అండ్ మాసీ లుక్‌లో రమ్యకృష్ణ కనిపించడం అభిమానులు షాక్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు "మా శివగామిని ఇలా మార్చేశారేంటి?" అని కామెంట్లు చేస్తున్నప్పటికీ, చాలా మంది మాత్రం "ఇది కొత్త రమ్యకృష్ణ రీ-ఇన్‌వెన్షన్" అంటూ ప్రశంసిస్తున్నారు. 'పోలీస్ స్టేషన్ మే భూత్' 2026లో విడుదల కానుంది.
ఆర్జీవీకి ఇది మరో రీఎంట్రీ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. గతంలో విడుదలైన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపిస్తారా అనే ఆసక్తి పెరిగింది. రమ్యకృష్ణ, మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా కలయికతో రూపొందుతున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం రమ్యకృష్ణ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











